Begin typing your search above and press return to search.

కన్యత్వం పోయినా ఇలా తెచ్చుకోవచ్చు!

By:  Tupaki Desk   |   28 Nov 2019 7:00 AM IST
కన్యత్వం పోయినా ఇలా తెచ్చుకోవచ్చు!
X
నువ్వు వర్జినా..? ఈ ప్రశ్న ఇప్పటి ఆధునిక యుగంలో అందరి నోటి నుంచి వెలువడుతుంది. కానీ ఈ కాలంలో కన్యత్వం కాపాడుకునేంత పెద్ద టాస్క్ ఇంకోటి లేదు. ఆడ - మగ పెళ్లికి ముందే శృంగారాన్ని అనుభవిస్తూ తమ వర్జినిటీని కోల్పోతున్నారు.

అయితే తమను పెళ్లి చేసుకునే భర్తకు తాము వర్జిన్ గానే కనపడాలని మహిళలు ఉబలాటపడుతున్నారు. ఈ కోవలోనే బ్రిటన్ లో సరికొత్త ఆపరేషన్లకు తెరలేచింది.

చాలా మంది పెళ్లికి ముందే తొలిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడే వారు ‘కన్యత్వం’ పోగొట్టుకుంటున్నారు. అలా పోయిన వర్జినీటిని తిరిగి పొందవచ్చని బ్రిటన్ వైద్యులు తేల్చారు. ఇప్పటివరకు బ్రిటన్ లో చాలామంది యువతులు తమ వర్జినిటీ కోల్పోయారని నేషనల్ హెల్త్ సర్వీస్ స్వయంగా వెల్లడించారు.

తాజాగా బ్రిటన్ కు చెందిన మహిళలు సెక్స్ లో పాల్గొన్న తర్వాత కూడా ఈ హైమన్ పొర తిరిగి ఏర్పడటం కోసం సర్జరీలు చేయించుకుంటున్నారు. మళ్లీ వర్జిన్ గా చెప్పుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ సర్జరీలో హైమెన్ పొరను తిరిగి ఏర్పడేలా చేస్తారు. కుట్ల ద్వారా తిరిగి ఏర్పడేలా డాక్టర్లు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ తో మహిళలు తిరిగి వర్జినిటీని పొందుతున్నారట.. కాబోయే భర్తలను కూడా తాము వర్జిన్ లమని ‘సంతృప్తి’ పరుచుతుడడం విశేషం.

అరగంట సమయం పట్టే ఈ ఆపరేషన్ ఖరీదు అక్షరాల వెయ్యి పౌండ్లు. మన రూపాయల్లో 91,797 . ఇలా బ్రిటన్ లో సర్జరీలు చేయించుకునే వారి సంఖ్య బాగా పెరుగుతోందట..