Begin typing your search above and press return to search.

వైరల్: అప్ఘన్ దుస్థితిపై మహిళా డైరెక్టర్ లేఖ

By:  Tupaki Desk   |   18 Aug 2021 2:30 AM GMT
వైరల్: అప్ఘన్ దుస్థితిపై మహిళా డైరెక్టర్ లేఖ
X
ఏ మీడియాలో చూసినా ఇప్పుడు అప్ఘనిస్తాన్ గురించే. తాలిబన్లు ఆ దేశాన్ని ఆక్రమించుకోవడంతో అక్కడి పరిస్థితులు మొత్తంగా మారిపోతున్నాయి. 20 ఏళ్ల కింద జరిగిన ఘోరాలన్నీ మళ్లీ జరుగుతున్నాయి. తాలిబన్ల రూల్స్ కు అనుగుణంగానే వ్యవస్థ మారిపోతోంది. వారు చెప్పినట్లే అన్నీ సాగుతున్నాయి. ముఖ్యంగా మహిళల విషయంలో తాలిబన్ల అరాచకం అంతా ఇంతా కాదు. ఇప్పటికే చాలా మంది చిన్నారులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓ సినిమా దర్శకురాలు లేఖ ద్వారా అక్కడి పరిస్థితులను బహిర్గతం చేసింది. మహిళ బయట కనిపించడమే పెద్ద సాహసంగా మారింది. ఇక మిగతా వారికి కూడా తాలిబన్లు వదలడం లేదు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని విచక్షణ రహితంగా కాల్చేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఆమె ఓ లేఖ ద్వారా ట్వీట్ చేసింది.

20 ఏళ్ల కిందట తాలిబన్లు పాలించిన అప్ఘనిస్తాన్ ను మళ్లీ ఆక్రమించారు. దాదాపు ఆ సమయంలో పెట్టిన నిబంధనలే మళ్లీ విధిస్తున్నారు. బాలికలను కిడ్నాప్ చేస్తున్నారు. మహిళలపై దారుణాలు చేస్తున్నారు. ఇక్కడ క్షణమొక యుగంలా సాగుతోంది జీవనం అంటూ సహ్ర కురిమి బహిరంగంగా లేఖ రాశారు. ‘గత కొన్ని రోజులుగా తాలిబన్లు దేశాన్ని ఆక్రమించే క్రమంలో ప్రజలను చిత్ర హింసలు పెడుతున్నారు. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి అంతా కూలిపోతుంది. ఇళ్లు లూటీ చేస్తున్నారు. ఎవరైనా వారి ఆగడాలకు అడ్డు వస్తే కాల్చిపారేతస్తున్నారు.

ఓ కమెడియన్ ను ఇంటి నుంచి బయటకు ఈడ్చుకొచ్చి చిత్ర హింసలు పెట్టి చంపేవారు. మరో మహిళ కళ్లు పీకేశారు. కొంత మంది రచయితలు, మీడియా, ప్రభుత్వ పెద్దలను ఇప్పటికే చంపేవారు. తాలిబన్లు పాలిస్తే అన్నీ నిషేధమే. మానవ హక్కులను కాలరాస్తారు. తాలిబన్లు ఉన్నప్పుడు స్కూళ్లలో ఒక్కమ్మాయి కూడా కనిపించేది కాదు. మొన్నటి వరకు ప్రభుత్వం హయాంలో 9 మిలియన్ల బాలికలు పాఠశాలలకు వెళ్లారు. చక్కగా చదువుకుంటున్న వారి జీవితంలో తాలిబన్లు నిప్పులు పోస్తారు. వారి చదువు సంగతి దేవుడెరుగు.. అసలు వారు బయటకు వస్తే బతుకుడే పెద్ద గగనంలా మారింది.

ఇంతటి దురాగత పాలన సాగిస్తున్న తాలిబన్ల పాలన మరోసారి సాగకుండా నాతో చేతులు కలపండి. ఇప్పటికే ముక్కలైన గుండెతో ఈ లేఖను రాస్తున్నా. దయచేసి ఎవ్వరూ భయపడొద్దు. దీన్ని అందరూ షేర్ చేయండి.’ అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ ను భారతీయ ప్రముఖ డైరెక్టర్ అనుగాగ్ కశ్యప్ రీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అయితే అమెరికా బలగాలు ఉపసంహరించుకున్న తరువాత తాలిబన్లు ప్రజలను హింసించడం లేదని ప్రకటించారు. కానీ కొన్ని చోట్ల మాత్రం అరాచకాలు ఆగడం లేదని ఇలాంటి మెసేజ్ లతో తెలుస్తోంది.

ఇప్పటికే దేశం మొత్తం ఆక్రమించిన తాలిబన్లు త్వరలో రష్యా, చైనా సహకారం తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. 1989తో తమ బలగాలను ఉపసంహరించుకున్న రష్యా మరోసారి ఎలాంటి సహకరిస్తుందోనని చర్చసాగుతోంది. మరోవైపు తాలిబన్ల రాకతో అక్కడి నుంచి ప్రజలు ఇప్పటికే ఇతర ప్రదేశాలకు పయనమయ్యారు. అప్ఘనిస్తాన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లడానికి కాబూల్ విమానాశ్రయం తప్ప వేరే మార్గం లేదు. అయితే ఈ విమానాశ్రయానికి ప్రయాణికుల తాడికి తీవ్రంగా మారింది. కొందరు విమానం టైర్లను పట్టుకొని వేలాడిన వీడియో వైరల్ గామారింది. ఇక ఈ విమానాశ్రయం సిబ్బంది తాలిబన్లు ప్రవేశించారనగానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో విమానాశ్రాల రాకపోకలు ఇబ్బంది ఏర్పడింది. బయటికి వెళ్లాలనుకునే వారు ఏదో రకంగా మార్గం చూసుకుంటున్నారు.