Begin typing your search above and press return to search.

సాక్షి మహారాజ్ సూచనను కోర్టులు పట్టించుకుంటాయా?

By:  Tupaki Desk   |   17 April 2016 4:39 AM GMT
సాక్షి మహారాజ్ సూచనను కోర్టులు పట్టించుకుంటాయా?
X
కోర్టులు సంకట స్థితి ఎదుర్కోనున్నాయా? .. ఒక ధర్మ సందేహాన్ని తీర్చే బాధ్యత కోర్టుల మీద పడునుందా? అంటే.. అవుననే మాట బలంగా వినిపిస్తోంది. కొన్ని హిందూ దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం ఉండదు. అది కూడా చాలా తక్కువ ఆలయాల్లో మాత్రమే. అయితే.. స్త్రీ - పురుష మధ్య లింగ బేధం ఏమిటంటూ.. ఆలయ ప్రవేశానికి మహిళల్ని ఎందుకు అనుమతించంరంటూ ఈ మధ్యన న్యాయస్థానాలు తీర్పులు ఇవ్వటం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక వాదన తెర మీదకు వచ్చింది. కొన్ని ప్రత్యేక పరిమితులు ఉన్న హిందూ దేవాలయాల్లోకి మహిళలకు ప్రవేశం కల్పించాలంటూ కోర్టులు చెప్పిన మీదట.. ముస్లిం మహిళలు మసీదుల్లోకి వెళ్లేలా అనుమతించేలా నిర్ణయం వెల్లడిస్తారా? అంటూ కోర్టులను ప్రశ్నిస్తున్న వైనం రోజురోజుకి పెరుగుతోంది. తాజాగా బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.

హిందూ స్త్రీలు ఆలయాలకు వచ్చి పూజలు చేస్తున్నట్లే.. ముస్లిం మహిళలు కూడా మసీదుల్లోకి ప్రవేశించాలని.. వారికి ఆ హక్కు ఉన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. కోర్టులు జోక్యం చేసుకొని.. మధ్యవర్తిత్వం వహించాలని ఆయన కోరుతున్నారు. హిందూ దేవాలయాల్లోని పరిమితుల్ని ప్రశ్నిస్తున్న కోర్టులు.. ముస్లిం మహిళలకు కూడా ఇదే తరహా సూచనలు చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. మరి.. ముస్లిం మహిళలు మసీదుల్లోకి వెళ్లే విషయంపై కోర్టులు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.