Begin typing your search above and press return to search.
ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో మొగుడ్ని దారుణంగా చంపేసింది
By: Tupaki Desk | 2 Nov 2019 7:19 AM GMTమహానటి అనక మరేమనాలి. కట్టుకున్న భర్తను ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో చంపించటమే కాదు.. ఐదారు నెలల నుంచి పోలీసులకు.. మరెవరికీ అనుమానం రాకుండా మేనేజ్ చేయటం మామూలు విషయమా? ఇటీవల కాలంలో భర్తను భార్యలు చంపించే ధోరణి అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా బయటకు వచ్చిన ఈ ఉదంతం సంచలనంగా మారటమే కాదు.. మానవ సంబంధాల మీద సరికొత్త అనుమానాలు రేకెత్తేలా ఉందని చెప్పక తప్పదు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూరుకు చెందిన నలభై ఏళ్ల ఉదయ్ కుమార్ కు పావని అలియాస్ లావణ్యతో పెళ్లైంది. వారికో పాప ఉంది. ఆమెకు మరో ఇద్దరితో వివాహేతర సంబంధం ఉంది. తమ జల్సాలకు అడ్డుగా ఉన్న భర్తను లేపేయాలని తన ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ కు చెప్పింది. దీని కోసం వారు పక్కా ప్లాన్ వేశారు.
సొంతూళ్లో చనిపోతే అనుమానం వస్తుంది కాబట్టి.. జిల్లాలు దాటించి లేపేయాలనుకున్నారు. ఇందులో భాగంగా మూడేళ్ల కుమార్తె పుట్టు వెంట్రుకల తీసేందుకు అవసరమైన డబ్బుల్ని తనకు తెలిసిన గంగాధర్.. దౌలాజీ (బాయ్ ఫ్రెండ్స్) ఇస్తారని ఆర్మూరు నుంచి పంపింది. తన హత్యకు కట్టుకున్న భార్యే ప్లాన్ చేసిందన్న విషయాన్ని తెలుసుకోని ఉదయ్ కుమార్ నమ్మి వెళ్లారు.
ఈ ముగ్గురు కలిసి మామడ మండలం పొస్కల్ గోదావరి వద్దకు తీసుకెళ్లారు. ముగ్గురూ పూటుగా తాగారు. చివరి నిమిషంలో తమ ప్రియురాలు లావణ్యకు ఫోన్ చేసి.. ఫుల్ గా తాగించామని.. చంపేయాలా? అని అడిగితే చంపేయమని చెప్పటంతో గోదావరిలోకి తీసుకెళ్లి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. తర్వాత తమకేమీ తెలీదన్నట్లుగా అక్కడి నుంచి వచ్చేశారు. ఇదంతా ఈ ఏడాది జూన్ లో జరిగింది.
ఇదిలా ఉంటే హత్యకు గురైన ఉదయ్ కుమార్ డెడ్ బాడీ కుళ్లిపోయిన స్థితిలో ఉన్న విషయాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు.. అనుమానాస్పద మరణంగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేసి.. అంత్యక్రియలు నిర్వహించారు. శవం తాలూకు ఫోటోల్ని అన్ని జిల్లాల పోలీస్ స్టేషన్లకు పంపారు. మరోవైపు కనిపించకుండా పోయిన ఉదయ్ కుమార్ గురించి లావణ్యను ఆమె కుటుంబ సభ్యులు ఎంత అడుగుతున్నా.. తనకు తెలీదంటూ ఏడుస్తూ చెప్పేది.
ఇదే సమయంలో ఉదయ్ కుమార్ సోదరి లావణ్య ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో ఇంట్లో దౌలాజీ అలియాస్ రమేశ్ సన్నిహితంగా ఉండటంతో అనుమానం వచ్చింది. తన సోదరుడు గురించి ఆమె ఆరా తీయగా లావణ్య నుంచి సరైన సమాచారం రాలేదు. భర్త ఎక్కడికో వెళితే అందరూ తనను అడుగుతున్నారంటూ మండిపడింది. దీనికి తోడు ఉదయ్ సోదరిని దౌలాజీ బెదిరించటంతో భయపడిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇక్కడే కథ మలుపు తిరిగింది. పాపం పండింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు లావణ్య మీద నిఘా పెట్టారు. ఇదే సమయంలో దౌలాజీతో టూవీలర్ మీద వెళుతున్న పావనిని పోలీసులు అడ్డుకొని ప్రశ్నించారు. దీంతో హత్య వ్యవహారం బయటకు వచ్చింది. అంతేకాదు.. లావణ్యకు ఉన్న మరో బాయ్ ఫ్రెండ్ గంగాధర్ వ్యవహారం బయటకు వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఉదయ్ కుమార్ ను చంపేసిన తర్వాత అతడు ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిపోయాడు. దీంతో.. లావణ్య దౌలాజీతో సహజీవనం చేస్తోంది. పక్కదారి పట్టి.. బాయ్ ఫ్రెండ్ల మత్తులో పడి భర్తను చంపేసిన లావణ్య ఇప్పుడు కటకటాల్లో పడింది. దుబాయ్ వెళ్లిపోయిన గంగాధర్ ను తిరిగి తీసుకొచ్చేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.