Begin typing your search above and press return to search.
ఆ ఎమ్మెల్యే వల్ల నాకు ప్రాణ హాని.. మహిళా నాయకురాలి సంచలన ఆరోపణలు
By: Tupaki Desk | 14 Dec 2021 12:30 AM GMTఏపీకి చెందిన వైసీపీ నేతల్లో పలువురు నేతలు వివాదాలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. వారు సంచలనాలు కోరుకుంటున్నారో లేక.. మరేం కోరుకుంటున్నారో తెలియదు కానీ.. పార్టీని.. వారి పరువును కూడా బజారున వేసుకుంటున్నారు. ఇలాంటి వారిలో కృష్నాజిల్లా పెడన నియోజకవర్గం ఎమ్మెల్యే జోగి రమేష్ ముందుంటున్నారు.గతంలో చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించా రనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.
అదేసమయంలో దూకుడుగా వ్యవహరించే నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఎన్నిక ల సమయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగ్రహానికి కూడా గురయ్యారు. ఇక, ఇప్పుడు ఏకంగా సొంత పార్టీ మహిళా నాయకురాలే జోగిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం వైసీపీ నాయకురాలు జక్కా లీలావతి తాజాగా ఎమ్మెల్యే జోగి రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జోగి రమేష్ నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని అన్నారు. తొలిసారి మీడియా ముందుకు వచ్చిన లీలావతి.. జోగిపై అనేక ఆరోపణలు చేశారు. జోగి రమేష్ వల్ల తమకు ప్రాణహాని ఉందన్నారు.
``నా భర్త కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం పడతడిక సర్పంచ్ ప్రదీప్ కుమార్. గతంలో నాపై , నా భర్తపై కేసులు పెట్టి వేధించారు. నా భర్తకు ఎమ్మెల్యే జోగి రమేష్ కొంతమంది వ్యక్తులు చేత మత్తుమందు ఇచ్చి తన వైపునకు తిప్పుకున్నాడు`` అని లీలావతి పేర్కొన్నారు.. అంతేకాదు.. పార్టీ కోసం తాము ఎంతో చేశామని.. పాదయాత్ర సమయంలోనూ జగన్ సీఎం కావాలని.. తాము కూడా సంఘీభావం ప్రకటించామన్నారు.
అయితే.. పార్టీ అధికారంలోకి వచ్చిన రెండున్నర సంవత్సరాల్లో ఎమ్మెల్యే తమను అనేక ఇబ్బందులకు గురి చేశారని లీలావతి ఆరోపించారు. తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఈ బెదిరింపులతో తాము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో జోగి నుంచి తమను రక్షించే బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని లీలావతి పేర్కొన్నారు. ఇదిలావుంటే.. ఎమ్మెల్యే జోగిపై లీలావతి చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం, వైసీపీ ఎలా స్పందిస్తాయో చూడాలి.