Begin typing your search above and press return to search.

కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై సెటైర్లు వేసిన మహిళా నేత‌లు

By:  Tupaki Desk   |   18 March 2022 6:51 AM GMT
కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై సెటైర్లు వేసిన మహిళా నేత‌లు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ఆయ‌న వివిధ రాష్ట్రాల్లో ప‌ర్య‌టించారు. ప‌లువురు నేత‌ల‌తో చ‌ర్చించారు కూడా. త‌దుప‌రి ఆయ‌న వ్యూహం ఎలా ఉంటుంద‌న్న దాని పై ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు డిసైడ్ చేస్తాయ‌నే టాక్ వ‌చ్చింది. ఈ ఫ‌లితాల్లో బీజేపీ ప్ర‌భంజ‌నంతో తెలంగాణ ముఖ్య‌మంత్రి వైఖ‌రి ఏంట‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇదే స‌మ‌యంలో ఇద్ద‌రు మ‌హిళా నేత‌లు గులాబీ ద‌ళ‌ప‌తి జాతీయ రాజ‌కీయ‌ల‌పై కామెంట్లు చేశారు.

ఇటీవల వెల్లడైన నాలుగు రాష్ట్రాల ఫలితాలతో కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాస్తవాలు తెలిశాయని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సెటైర్ వేశారు. రాష్ట్రాల పర్యటనలను కేసీఆర్ ఎందుకు ఆపేసుకున్నాడో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్, దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని స్పీకర్ తిరస్కరించిన తీరును నిరసిస్తూ ఆ పార్టీ గురువారం ఇందిరా పార్కు వద్ద 'ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష' చేపట్టింది.

ఈ సంద‌ర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ, జాతీయ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు వాటి గురించి ప్ర‌స్తావించ‌డం లేద‌ని అన్నారు. పీకేలు, ఏకే 47లు కేసీఆర్ అధికారాన్ని కాపాడలేవని సెటైర్ వేశారు. కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయమని, తెలంగాణలో బీజేపీ జెండా రెపరెపలాడడం పక్కా అని స్పష్టం చేశారు. మహిళా గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అవమానించిన కేసీఆర్ ను ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు.

ప్రజాప్రస్థానం పేరుతో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల 28వ రోజు యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి చేరుకుంది. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో షర్మిల మాట్లాడారు. బంగారు తెలంగాణ చేస్తా అని, ఆత్మహత్యల తెలంగాణ చేసిన ఘనత కేసీఆర్ దేనని విమర్శించారు. 'రాష్ట్రంలో రైతులు, చేనేత కార్మికులు, నిరుద్యోగులు చనిపోతే పరామర్శించని ముఖ్యమంత్రి.. దేశాన్ని ఏలుతా అని తిరగడం విడ్డూరం.

బంగారు తెలంగాణ చేస్తా అని.. బీర్లు, బార్లు, అప్పుల తెలంగాణ చేశాడు. తెలంగాణ వచ్చాక కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించాలి.' అని వ్యాఖ్యానించారు.