Begin typing your search above and press return to search.
మహిళా నేతలు జగన్ చంద్రబాబులను అన్న మాటలు వింటే....?
By: Tupaki Desk | 10 April 2023 10:11 AM GMTరాజకీయాల్లో విమర్శలలో హుందాతనం లేకుండా పోతోంది అని పదే పదే అంటూంటారు. కానీ మీడియాలో ఎలా హైలెట్ కావాలా అన్న దాని మీదనే నేతలు ఫోకస్ పెడుతూ మాటలను అగ్గి బరాటాల్లా మండిస్తున్నారు.ఒక్క రోజు తేడాలో విశాఖలో ఇద్దరు మహిళా మణులు రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు ముఖ్యమంత్రిని ప్రతిపక్ష నాయకుడిని పట్టుకుని అన్న మాటలు విన్న వారు ఆశ్చర్యపోయేలా ఉన్నాయని అంటున్నారు.
ముందుగా తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న వంగలపూడి అనిత విశాఖలో మీడియా మీటింగ్ పెట్టి జగన్ మీద విరుచుకుపడ్డారనే చెప్పాలి. పదహారు నెలలు చిప్పకూడు తిని వచ్చిన వారా ఏపీకి భవిష్యత్తు ఇస్తారంటూ జగన్ మీద పవర్ ఫుల్ పంచులేశారు. తల్లిని చెల్లిని రాజకీయం కోసం వదిలించుకున్న వారని, రేపటి రోజున సతీమణి భారతి కూడా ఎవరో తెలియదు అన్నా ఆశ్చర్యం పోనవసరం లేదని ఎన్నడూ ఎవరూ అనని మాటలనే వాడారు.
సొంత బాబాయి హత్య చేయించి ఏమీ ఎరగనట్లుగా శవం దగ్గర కూర్చున్నాడని, ప్రొఫెషనల్ కిల్లర్ అని చెడా మడా తిట్టేసారు అనిత. ఏపీకి జగన్ భవిష్యత్తు నమ్మకం కాదు దరిద్రం అనేశారు. ఏపీని సర్వనాశనం చేసిన జగన్ ఏపీకి శాపమని శాపనార్ధాలే పెట్టారు.
అనిత అలా విమర్శలు గుప్పించగానే వైసీపీ ఎమ్మెల్సీ వరుడు కళ్యాణి ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబుని పట్టుకుని ఆమె ఏపీకి పట్టిన క్యాన్సర్ గడ్డ అనేశారు. ఆయన ఏపీకి కరోనా కంటే హీనాతిహీనం అని కూడా నిందించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినది బాబే కదా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇవన్నీ ఎందుకు ఏపీకి చంద్రబాబే అతి పెద్ద సమస్య అని పెద్ద బండనే వేశారు.
ఏపీకి చంద్రబాబు లాంటి నేత హానికరమని కూడా కళ్యాణి కొత్త మాట చెప్పారు. చంద్రబాబు ఒక దరిద్రం, ఆయన అబద్ధాలకు అడ్డా అని కూడా అనేశారు. చంద్రబాబు ఎన్ని రకాలుగా జిమ్మిక్స్ చేసినా మరెన్ని విన్యాసాలు చేసినా 2024 ఎన్నికలతో ఆయన రాజకీయ జీవితం పూర్తిగా పరిసమాప్తం అవుతుందని కూడా వరుడు కళ్యాణి జోస్యం చెప్పేశారు.
విశాఖ జిల్లా రాజకీయాల్లో ఈ ఇద్దరు మహిళా నాయకులు ఇలాగే ఢీ అంటే ఢీ అంటూ ఉంటారు. ఒకరు ఎమ్మెల్యేగా పనిచేసి తెలుగు మహిళా స్టేట్ ప్రెసిడెంట్ గా ఉంటే మరొకరు ఎమ్మెల్సీగా ఉంటూ వైసీపీ స్టేట్ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటున్నారు. అయితే ఈ ఇద్దరు తమ పార్టీ అధినాయకత్వం మెప్పు కోసమో మరో దానికో కానీ మాజీ సీఎం ప్రస్తుత సీఎంలను చూడకుండా వారి హోదాలను సైతం మన్నించకుండా దారుణంగా విమర్శలు చేయడంతో జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. జగన్ని ప్రొఫెషనల్ కిల్లర్ అని అనిత అనడం ఎంత తప్పో కరోనా కంటే బాబు హీనమని కళ్యాణి అనడం అంతే తప్పు అని ఎవరు వీరికి చెబుతారు.
అందుకే ఎన్నికల ఏడాదితో ఇంతకంటే కొత్త పదాలతో మరిన్ని కొత్త తిట్ల దండకాలతో ఈ నేతలతో పాటు వీరి స్పూర్తితో మరింత మంది మీడియా ముందుకు వచ్చి రెచ్చిపోవడం ఖాయమనే అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.