Begin typing your search above and press return to search.
ఆయుధం పట్టిన మహిళా ఎంపీ..తగ్గేదేలే!
By: Tupaki Desk | 27 Feb 2022 2:29 AM GMTఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించి నేటి నాలుగు రోజులు అవుతుంది. ఈ నాలుగు రోజుల్లో ఉక్రెయిన్ సుమారు 3,500 మంది సైనికులను కోల్పోయింది. ఇదే విషయాన్ని అనేక అంతర్జాతీయ పత్రికలు ఇప్పటకే ప్రచురించాయి. నానాటికీ సైనికుల సంఖ్య మరింత తగ్గుతుంది.
కానీ ఆ దేశ అధ్యక్షుడు సైనికులలో, దేశ ప్రజల్లో నింపిన స్పూర్తి అంతా ఇంతా కాదు. అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎప్పటికప్పుడు అందించిన స్పూర్తి సందేశాలే వారిలో ఎక్కడ లేని దేశ భక్తి ని రగిలించాయి అని చెప్ప వచ్చు. చిన్న , పెద్ద, ముసలి, ముతక అనే అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. 70 ఏళ్ల బామ్మ దగ్గర నుంచి యువకులు వరకు అందరూ రష్యా సేనలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముందుకు వస్తున్నారు.
తమ దేశాన్ని కాపాడుకోవడానికి, దేశ భక్తిని ప్రదర్శించుకోవడానికి ఈ సమయమే సరైనదని కేవలం ప్రజలు మాత్రమే కాకుండా ప్రజా ప్రతినిధులు కూడా ముందడు వేస్తున్నారు. అంతే ఆ దేశాధ్యక్షుడు జెలెన్‌స్కీ వారిలో నింపిన స్పూర్తి అది.
అయితే అదే స్పూర్తితో ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యురాలు అయిన ఎంపీ కిరా రుడిక్ కూడా తన వంతుగా కదన రంగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నానని అంటున్నారు. ఇందుకు గాను ఆమె యుద్ధం చేసేందుకు ఆయుధాన్ని చేత బట్టారు.
దేశానికి అండగా నిలిచేందుకు తన వంతుగా ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాని తెలిపారు. ఇప్పటికే యుద్ధ భూమిలో అడుగు పెట్టిన కొన్ని వేల మంది లానే తాను తన భూభాగం రష్యా సేనల వశం కానివ్వను అని అంటున్నారు.
రష్యా దాడిని ఎదుర్కొనవడంతో పాటు తిరిగి వారిపై ప్రతి దాడి చేసేందుకు కలాష్నికోవ్ అనే ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నారు. కేవలం ఈ ఆయుధాన్ని ఎలా పట్టుకోవాలో తెలుసుకోవడమే కాకుండా... దానితో కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్తున్నారు.
రష్యాపై తాము చేసే యుద్ధంలో స్త్రీ, పురుషుడు అనే తేడా లేకుండా పోరాడతామని ఎంపీ కిరా రుడిక్ అంటున్నారు. తమ నేలను రక్షించుకోవడం తమ ముందున్న ఏకైక కర్తవ్యం అని చెప్తున్నారు. రష్యా యుద్ధ సన్నద్ధత మొదలు పెట్టిన నాటి నుంచి తాను చాలా ఆవేశంతో ఉన్నానని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తమ దేశం విలువ తెలియడం లేదని పేర్కొన్నారు.
స్వతంత్ర దేశమైన ఉక్రెయిన్ కు ఉన్న ఉనికిని పుతిన్ ఎందుకు గుర్తించడం లేదు అనేది తమకు ఇప్పటికీ అర్థం కావడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే పార్లమెంట్ సభ్యులతో పాటు వారి కుటుంబాలను కూడా రష్యా బెదిరిస్తున్నట్లు చెప్పారు. అయినా కానీ తాము దేశ రాజధాని అయిన కీవ్ లోనే ఉంటున్నట్లు చెప్పారు. అధ్యక్షునితో పాటు ఇదే నగరంలో ఉంటూ తమ దేశాన్ని, కుటుంబాలను రక్షించుకుంటామని అంటున్నారు.
తనతో పాటు కలిసి వచ్చే చట్ట సభ సభ్యులను కూడా కలుపుకుని పోతామని తెలిపారు ఎంపీ కిరా రుడిక్ . అంతేకాకుండా ఉక్రెయిన్ లో ఉండే స్త్రీలు కూడా రష్యా సేనలతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇందుకు గానూ కలిసి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఆయుధాలు తీసుకుని బరిలోకి దిగినట్లు చెప్పారు. త్వరలో రష్యా సేనల ఆలోచనలకు అంతుబట్టని రీతిలో దాడి చేసి వారికి షాక్ ఇస్తామని అంటున్నారు.