Begin typing your search above and press return to search.
ఆ ఊరు దాటి ఏ ఆడపిల్ల బయటకి వెళ్లదు..ఎందుకంటే ?
By: Tupaki Desk | 22 Nov 2019 1:30 AM GMTసాధారణంగా కొన్ని పల్లెటూర్లలో కొన్ని కొన్ని ఆచారాలు అనాదిగా వస్తుంటాయి. వాటిని ఇప్పటికి కూడా కొంతమంది పాటిస్తుంటారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలని పాటించే గ్రామాలు ఇంకా ఇప్పటికి కూడా ఉన్నాయి. అలాంటి ఆచారాలని పాటించే గ్రామాలలో ఒకటి ..విజయనగరం జిల్లాలో ఉంది. ఆ గ్రామం ప్రత్యేకత ఏమిటంటే ... మాములుగా ప్రస్తుత రోజుల్లో ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా కూడా తమ ఇంటి ఆడపిల్లకి మంచి గొప్పింటి సంబంధం తీసుకురావాలని - మంచి ఉద్యోగం చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేయాలని కోరుకుంటారు. ఇది సహజం కానీ - విజయనగరంలో ఉన్న గ్రామం ప్రజలు మాత్రం దీనికి విరుద్ధం.
ఆ గ్రామానికి చెందిన వారంతా .. అదే గ్రామానికి చెందిన వారిని మాత్రమే వివాహాలు చేసుకుంటున్నారు. వారితోనే జీవితాలను పంచుకుంటున్నారు. అనాదిగా అదే ఆచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ ఆచారాన్ని పాటిస్తున్న గ్రామం ఎక్కడ ఉంది - ఆ గ్రామం పేరేమిటి అంటే ... విజయనగరం జిల్లా జామి మండలం లో గల లొట్లపల్లి గ్రామం వాసులు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. లొట్లపల్లిలో సుమారు ఒక వెయ్యి మంది జనాభా ఉంటారు. తాతలకాలం నుంచి కూడా గ్రామస్తులంతా ఆ గ్రామస్తులనే వివాహం చేసుకోవడం ఆనవాయితీ. ఇతర గ్రామాల - ప్రాంతాల సంబంధాలు చేసుకోడానికి ఇష్టపడరు. పిల్లలకు వివాహ వయస్సు వచ్చేసరికి కుటుంబ పెద్దలు - గ్రామ పెద్దలు సమావేశమై ఇద్దరినీ ఒప్పించి పెళ్లిళ్లు జరిపిస్తారు.
మేనత్త కూతుళ్లు - అక్క కూతుళ్లను వివాహం చేసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. దగ్గరి సంబంధాలు దొరక్కపోతే ఇతర కుటుంబాల్లో వరస అయ్యేవారిని చేసుకుంటారు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే బయటి సంబంధాలు చేసుకుంటారు. ఆ ఊరివారినే చేసుకుంటే కుటుంబాలు బలపడతాయని - వ్యవసాయం లేదా ఇతర పనులు చేసుకోటానికి వీలుంటుందని వారి నమ్మకం. ఒకరికొకరు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారని వారి నమ్మకం. ఆస్తులు కూడా బయటి వారికి పోకుండా అవే కుటుంబాల మధ్య ఉంటాయని… పిల్లలు కూడా తమ కళ్లముందుంటారని ఆ గ్రామస్తుల ఉద్దేశం. అయితే అక్కడి వారిని - అలాగే అక్క కూతుర్లని చేసుకుంటే పుట్టే పిల్లలు బాగా పుట్టారు అంటారు కదా అంటే .. ఈ గ్రామంలో దగ్గరి బంధువులనే పెళ్లి చేసుకున్న వారికి పుట్టిన పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉండటం మరో విశేషం.