Begin typing your search above and press return to search.

సుప్రీం కోర్టు ఆవరణలో 144 సెక్షన్

By:  Tupaki Desk   |   7 May 2019 8:58 AM GMT
సుప్రీం కోర్టు ఆవరణలో 144 సెక్షన్
X
లైంగిక వేధింపుల కేసులో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ కు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని తప్పు పడుతూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున సుప్రీం కోర్టు ఆవరణలో నిరసన తెలపడం సంచలమైంది. ఈ ఘటనతో సుప్రీం కోర్టు ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు 144 సెక్షన్ కూడా విధించారంటే పరిస్థితి అర్థం చేసుకోచ్చు.

*కేసు పూర్వాపరాలు ఇవే..

సుప్రీం కోర్టులో గతంలో మహిళా ఉద్యోగిగా చేసిన మహిళపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ లైంగికవేధింపులకు పాల్పడ్డాడని సదురు బాధిత మహిళ ఆరోపించింది. దీనిపై విచారణకు ముగ్గురు సభ్యుల ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. బాధితురాలితోపాటు రంజన్ గొగొయ్ వాదనలు విన్న ధర్మాసనం అనంతరం సంచలన తీర్పును ఇచ్చింది. ఈ కేసులో చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ఎలాంటి తప్పులకు పాల్పడ లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రకటించింది.

*మారుమోగిన సుప్రీం కోర్టు

అయితే దీనిపై మహిళా సంఘాలు పోరుబాట పట్టాయి. గొగొయ్ ను రక్షించడానికి సుప్రీం కోర్టు ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు. అనంతరం ఏకంగా సుప్రీం కోర్టును ముట్టడించారు. సుప్రీం ఆవరణకు చేరుకొని నినాదాలు చేశారు. ధర్నాకు దిగారు. భైటాయించారు.. సుప్రీం కోర్టు కార్యకలాపాలను అడ్డుకున్నారు. మహిళల నినాదాలతో సుప్రీం ఆవరణ మారుమోగిపోయింది. దీంతో పోలీసులు మోహరించిన మహిళలను అడ్డుకొని తరలించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వారిని ప్రత్యేక వాహనాల్లో మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. 144 సెక్షన్ విధించారు.