Begin typing your search above and press return to search.
హిజాబ్ తీసివేసి వేల మంది మహిళలు నిరసన.. ముస్లిం దేశంలో సంచలనం!
By: Tupaki Desk | 19 Sep 2022 4:30 AM GMTపశ్చిమ ఇరాన్‌లో అనేక మంది మహిళలు వీధుల్లోకి వచ్చి తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. హిజాబ్‌ను సరిగ్గా పాటించనందుకు ఆ దేశ పోలీసులు అరెస్టు చేసి కొట్టడంతో 22 ఏళ్ల మహ్సా అమిని అనే యువతి మరణించిందని ఆరోపణ. దీనికి నిరసనగా పశ్చిమ ఇరాన్ ప్రాంతంలో వేలాది మంది మహిళలు తమ హిజాబ్‌లను తీసివేశారు. అంతేకాకుండా డెత్ టు డిక్టేటర్ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హిజాబ్ నిబంధనలు పాటించకపోవడం ఇరాన్‌లో శిక్షార్హమైన నేరం. ఇదే ఆరోపణల మీద 22 ఏళ్ల మహ్సా అమినీ అనే కుర్దిష్ యువతిని ఆమె ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను సందర్శించినప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను డిటెన్షన్ వ్యానులోనే తీవ్రంగా కొట్టారు. మూడు రోజులు మరణంతో పోరాడి ఆ యువత్రి ఆస్పత్రిలో కన్నుమూసిందని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మహిళలు తమ హిజాబ్‌లు తొలగించి భారీ నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో ఆందోళనలు చెలరేగాయి.
అమినీ చికిత్స పొందుతున్న ఆస్పత్రి వెలుపల నిరసనకారులు పెద్ద ఎత్తున చేరారు. హిజాబ్ తొలగించిన మహిళలు ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు అందుకున్నారు. తమను కూడా చంపాలంటూ హిజాబ్‌లు తొలగించారు. దీంతో ఇరాన్ పోలీసులు నిరసనకారులపై పెప్పర్ స్ప్రే చేశారు. అంతేగాక, వారిలో చాలా మందిని అరెస్టు చేశారు.
కాగా అమినీ మృతదేహాన్ని ఆమె స్వస్థలమైన కుర్దిస్థాన్ ప్రావిన్స్‌కు తీసుకెళ్లారు. వందలాది మంది అమిని స్వగ్రామంలో అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆగ్రహాన్ని తట్టుకోలేని నిరసనకారులు "నియంతకు చావు" తప్పదు అంటూ పెద్ద పెట్టున ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
మరోవైపు పోలీసుల వాదన మరోలా ఉంది. అమినీకి గుండెపోటు వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. గుండెపోటు వల్లే ఆమె మరణించిందని అంటున్నారు. అరెస్టు చేసే వరకు ఆమె ఆరోగ్యంగా ఉందని పేర్కొంటున్నారు. కాగా, ఇరాన్ తోపాటు పలు దేశాల్లో కూడా ఆ యువతికి మద్దతుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్ని సమయాలలో మహిళలు హిజాబ్ ధరించడంతోపాటు మహిళల దుస్తుల కోడ్‌ను కఠినంగా అమలు చేయాలని ఆదేశించిన కొన్ని వారాల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. అంతేకాకుండా హిజాబ్‌ను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలను కూడా ఆయన విధించారు.
ఇటీవల హిజాబ్ తీసివేసి పరీక్షలకు హాజరవ్వాలని కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. యూనిఫామ్ మాత్రమే ధరించి రావాలని సూచించింది. దీనిపై పెద్దపెట్టున నిరసనలు వ్యక్తమయ్యాయి. కర్ణాటక హైకోర్టు కూడా ప్రభుత్వ చర్యనే సమర్థించింది. ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.