Begin typing your search above and press return to search.

బయటకు వచ్చిన ‘సందీప్ సీడీ’ బాధితురాలు

By:  Tupaki Desk   |   4 Sep 2016 5:32 AM GMT
బయటకు వచ్చిన ‘సందీప్ సీడీ’ బాధితురాలు
X
అభ్యంతరకర వీడియోతో ఢిల్లీ రాష్ట్ర మంత్రి పదవిని పోగొట్టుకున్న సందీప్ పటేల్ ఉదంతానికి సంబంధించి కొత్త కోణం బయటకు వచ్చింది. ఇటీవల బయటపడిన సెక్స్ వీడియోలోని మహిళ బయటకు వచ్చారు. రేషన్ కార్డు కోసం మంత్రిగారి ఇంటికి వెళితే.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేసినట్లుగా ఆమె ఫిర్యాదు చేయటంతో ఈ ఉదంతం మరో మలుపు తిరిగినట్లైంది. తాను స్పృహలో లేనప్పుడు మంత్రి తనపై రేప్ చేశారంటూ సదరు బాధితురాలి ఫిర్యాదు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ చిక్కుల్లో పడింది. సందీప్ పటేల్ సెక్స్ టేపులు కొత్తవి కావని ఆయన కాలేజీ రోజులకు చెందినవంటూ వాదన వినిపిస్తున్న నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదుతో ఈ ఎపిసోడ్ మరో మలుపు తిరిగినట్లైంది.

బాధిత మహిళ ఫిర్యాదు నేపథ్యంలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సందీప్ పటేల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. సందీప్ పటేల్ మీద వచ్చిన ఆరోపణ నిజమైతే తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని.. అప్పుడు అతడ్ని తీవ్రంగా శిక్షించాలంటూ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

సెక్స్ టేప్ తో మంత్రి పదవిని పోగొట్టుకున్న సందీప్ పాటిల్.. తాజాగా బయటకు వచ్చిన రేప్ ఫిర్యాదు నేపథ్యంలో ఆయన్ను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లుగా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లుగా వెల్లడించారు. మరోవైపు.. సందీప్ పటేల్ సెక్స్ టేపుల నేపథ్యంలో.. గాంధీ మొదలు వాజ్ పేయ్ వరకూ అందరూ సందీప్ మాదిరే అంటూ దరిద్రమైన వాదనను వినిపించినా ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశుతోష్ వ్యాఖ్యలు అతని వ్యక్తిగత వ్యాఖ్యలుగా అభివర్ణించారు. మొత్తంగా చూస్తే.. సందీప్ సెక్స్ టేపు .. తదనంతర పరిణామాలు ఆమ్ ఆద్మీ పార్టీని ఇరుకున పెట్టేలా ఉన్నాయని చెప్పక తప్పదు.