Begin typing your search above and press return to search.
మిస్టరీగా తల్లీకొడుకుల ఆత్మహత్య, యువతి అదృశ్యం
By: Tupaki Desk | 30 May 2020 9:50 AM GMTఓ లెక్చరర్.. ఆమె కుమారుడు.. ఓ విద్యార్థి మరణాలు పోలీసులకు సవాల్‌గా మారింది. అనుమానాస్పద పరిస్థితుల్లో వారు మృతి చెందారు. ఈ రెండు వేర్వేరు సంఘటనలు మిస్టరీ వీడడం లేదు. హైదర్షాకోట్‌లో భార్గవి (30), తన కుమారుడిని చంపేసి ఆత్మహత్య చేసుకోగా మరో విద్యార్థిని అదృశ్యమై మరణించింది. తాజాగా ఈ కేసులకు సంబంధించి పోలీసులు మిస్టరీ ఛేదనలో ఉన్నారు.
ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన దంపతులు సతీశ్, భార్గవి (30) హైదరాబాద్ హైదర్షాకోట్‌లోని లక్ష్మీనరసింహనగర్‌లో ఇల్లు కొనుగోలు చేసి అక్కడే నివసిస్తున్నారు. వారికి కుమారుడు వరణ్య (10), 14 నెలల కుమార్తె ఉంది. సతీశ్ ఐటీ ఉద్యోగి కాగా భార్గవి అధ్యాపకురాలిగా పని చేస్తుండేది. అయితే కొన్ని రోజులుగా భార్గవి అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ విషయమై భర్తతో చెప్పి బాధపడుతుండేది. ఈ క్రమంలోనే శుక్రవారం భర్త ఉద్యోగానికి వెళ్లగా తాను ఉద్యోగానికి వెళ్తున్నానని పాపని పని మనిషికి ఇచ్చి పంపించింది. అయితే మధ్యాహ్నం ఇంట్లోనే కుమారుడు వరణ్య కళ్లకు గంతలు కట్టి ఉరేసింది. అనంతరం ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తన భార్య అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పటివరకు బాగానే ఉన్నా ఆమె అనారోగ్యంతో బాధపడుతుంటే ఆమెతో పాటు కుమారుడిని ఎందుకు చంపిందనే ప్రశ్న మెదులుతోంది. దీనిపై పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మృతురాలి తల్లిదండ్రుల ఏం చెబుతారో వేచి చూడాలి.
దీంతోపాటు హైదరాబాద్‌లో మరో సంఘటన జరిగింది. ఓ యువతి ఇంటి నుంచి అదృశ్యమై చివరకు ఓ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. చిలకలగూడ రైల్వేక్వార్టర్స్‌లో నివసించే గట్టు లక్ష్మీనారాయణ కుమార్తె మయూరి (18) ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. ఈనెల 28వ తేదీన సాయంత్రం నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై అదేరోజు రాత్రి తమ కుమార్తె అదృశ్యమైందని చిలకలగూడ పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. అయితే తెల్లవారుజామున ఇంటి వెనుక కుమార్తె మయూరి శవంగా కనిపించింది. మయూరి మరణం కూడా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంటికి ఎలా వచ్చింది? భవనంపైకి ఎందుకు వెళ్లింది..? ఎవరైనా భవనంపై నుంచి తోసేశారా..? ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో తెలియడం లేదు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.