Begin typing your search above and press return to search.

ఇంట్లో రూ.50లక్షలు ఉన్నాయని సూసైడ్

By:  Tupaki Desk   |   10 Nov 2016 10:40 AM GMT
ఇంట్లో రూ.50లక్షలు ఉన్నాయని సూసైడ్
X
పాడు డబ్బులు ఎన్ని ఇబ్బందులు తెస్తుందో అన్న పరిస్థితి. నిన్నటి వరకూ డబ్బులు చేతిలో ఉంటే ఆ సుఖమే వేరు అన్నది పోయి.. ఆ డబ్బులే ఇప్పుడు కొత్త కొత్త గొడవల్ని తెర మీదకు తీసుకొస్తున్నాయి. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం కొత్త చిక్కుల్ని.. విషాదాల్ని తెర మీదకు తీసుకొస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ కు చెందిన వినోద అనే మహిళ ఉదంతమే తాజా నిదర్శనం.

గత ఏడాది వారికున్నభూమిలో 12 ఎకరాల భూమిని అమ్మేశారు. అలా అమ్మగా వచ్చిన రూ.55 లక్షల్ని ఇంట్లోనే ఉంచేసుకున్నారు. గడిచిన ఏడాదిలో వారికి అయిన ఖర్చులతో రూ.5లక్షలు ఖర్చు అయిపోయాయి. నేటికీ రూ.50లక్షల వారింట్లోనే ఉంచేసుకున్నారు. అంత భారీ మొత్తాన్ని ఇంట్లో ఉంచుకున్న వారికి పెద్దనోట్ల రద్దు నిర్ణయం కొత్త చిక్కుల్ని తీసుకొచ్చింది.

ఇంట్లో ఉన్న రూ.50 లక్షలన్నీ రూ.500.. రూ.వెయ్యి నోట్లు కావటంతో వాటిని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. తీవ్ర మానసిక వేదనకు గురైన వారింట్లో మోడీ ప్రకటన తర్వాత నుంచి ఆశాంతి చోటు చేసుకుందని చెబుతున్నారు. పెద్దనోట్ల రద్దు ప్రకటన తర్వాత తినటం మానేసిన వారు.. ఇంట్లో ఉన్న డబ్బును ఎలా మార్చాలన్న అంశంపై వాదులాట చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

తమ ఇంట్లో ఉన్న రూ.50లక్షలు ఎందుకు పనికి రాకుండా పోతాయని.. వాటిని మార్చుకోవటం సాధ్యం కాదన్న భావనకు వచ్చి తీవ్ర మానసిక ఆందోళనకు గురైన వినోద.. ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. దీంతో వారింట్లో తీవ్ర విషాదం కమ్ముకుంది. ఇంట్లో ఉన్న రూ.50లక్షలు ఏం చేయాలో తెలీక కిందామీదా పడుతున్న ఆ కుటుంబానికి తాజా విషాదం శరాఘాతంగా మారిందని చెప్పొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/