Begin typing your search above and press return to search.
లైంగిక వేదింపులు ఎదుర్కొంటున్న మహిళా టీచర్స్ .. టాయిలెట్స్ లో స్పై కెమెరాలతో ... !
By: Tupaki Desk | 22 Sep 2020 5:01 PM GMTతమకి ఇవ్వవలసిన జీతాలు ఇవ్వకపోవడమే కాకుండా తమను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు మహిళా ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యంపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మీరట్ లోని సర్ధార్ బజార్ లో రిషబ్ అకాడమీ స్కూల్ నడుపుతున్నారు. ప్రస్తుతం కరోనా విజృంభణ తో లాక్ డౌన్ విధించడంతో పాఠశాలను మూసివేశారు. దీనితో ఆ స్కూల్ లో పనిచేస్తున్న పలువురు మహిళా ఉపాధ్యాయులు తమకు ఇవ్వాల్సిన జీతాలను ఇవ్వాలంటూ స్కూల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
అయితే , పాఠశాల సెక్రటరీగా ఉన్న రంజీత్ జైన్ అతని కొడుకు అభినవ్ జైన్ లు జీతాలు ఇవ్వకుండా ఆ మహిళా టీచర్లను వేధించడమే కాకుండా మహిళల టాయిలెట్ రూంలో రహస్యంగా స్పై కెమెరాలు అమర్చినట్లు తెలిసింది. ఈ ఫోటోలు, వీడియోలు చూపిస్తూ తమతో శారీరక సంబంధం పెట్టుకోవాల్సిందిగా బ్లాక్ మెయిల్ కు పాల్పడుతారని కొందరు మహిళా టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం చెప్పుచేతుల్లోకి రాని మహిళా టీచర్లను అదుపులోకి తెచ్చుకునేందుకు మంత్రగాళ్లని సైతం ఆశ్రయిస్తారన్నారు. దీంతో పాఠశాల గేటు ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు అక్కడినుంచి మీరట్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి రంజిత్, అభినవ్లపై ఫిర్యాదు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.