Begin typing your search above and press return to search.

అసలు వీడు భర్తేనా? భార్య ను అంతలా వేధిస్తాడట

By:  Tupaki Desk   |   29 Oct 2021 4:50 AM GMT
అసలు వీడు భర్తేనా? భార్య ను అంతలా వేధిస్తాడట
X
భార్య ను భర్త అవమానించి.. రాచి రంపాన పెట్టటం.. భర్త ను భార్య హింసించటం లాంటి ఉదంతాలు చాలా నే చూసి ఉంటారు. కానీ.. ఇప్పుడు చెప్పే ఉదంతం వింటే.. ఇలా టార్చర్ పెట్టే భర్త ఉంటాడా? కల లో కూడా ఊహించని రీతి లో భార్య ను హింసిస్తున్న వైనం వింటే.. వాడి మీద అసహ్యం పుట్టటమే కాదు.. వీడ్నేం చేసినా తప్పు లేదన్న భావన కలుగుతుంది. జూబ్లీహిల్స్ కు చెందిన ఒక మహిళ తన భర్త పెట్టే టార్చర్ భరించలేక వారిని ఆశ్రయించారు. తన కు రక్షణ కల్పించాలని.. తన భర్త పై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

పోలీసుల కు అందిన కంప్లైంట్ ప్రకారం నారాయణ పేటకు చెందిన మహిళ రహమత్ నగర్ లో ఉంటున్నారు. 2016 లో వీరి పెళ్లి జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికి భార్య ను మాట ల్లో చెప్పలేని రీతిలో వేధింపులకు గురి చేస్తుంటాడు. గతం లో గర్భం దాల్చిన భార్య ను బలవంతం గా అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత భర్త సోదరుడి తో పాటు భర్త సోదరి.. ఆమె భర్త ఇలా అందరూ ఆమె ను కులం పేరు తో తిడుతూ ఉండేవారు. అయిన ప్పటికీ మౌనం గానే ఉంది తప్పించి ఎదిరించలేదు.

తరచూ ఆమెను చంపుతామని బెదిరించేవాడు. అతడి డిమాండ్ ప్రకారం రూ.1.5 లక్షలు ఇస్తున్నా వేధింపులు ఆప లేదు. అయితే.. ఈ మధ్యన ఆమెను తరచూ అర్థ నగ్నంగా కూర్చోవాలని.. తన మూత్రం తాగాలని బలవంతం చేయటం ప్రారంభించాడు. దీంతో.. విసిగిపోయిన ఆమె తనకు భర్త నుంచి రక్షణ కావాలని.. అతడి మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంత దారుణం గా భార్య ను వేధించే భర్త ను అస్సలు విడిచి పెట్టకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.