Begin typing your search above and press return to search.

పిల్లలొద్దు.. మహిళల అనాసక్తి.. భవిష్యత్ డేంజరే..

By:  Tupaki Desk   |   16 July 2020 4:00 AM GMT
పిల్లలొద్దు.. మహిళల అనాసక్తి.. భవిష్యత్ డేంజరే..
X
ఇప్పటికే జపాన్ దేశంలో వృద్ధుల జనాభా పెరిగిపోతూ భారం అవుతోంది. పని రాక్షసులైన జపనీయులు పిల్లల్ని కనడానికే ఆసక్తి చూపించడం లేదట..నెలకు ఒకసారి కూడా శృంగారం చేసుకోని జంటలు అక్కడే వేల సంఖ్యలో ఉంటాయట.. అందుకే అక్కడి ప్రభుత్వాలకు మహిళలకు సెలవులు ఇచ్చి మరి పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తున్న వారు అస్సలు ఆసక్తి చూపించడం లేదట.. ఫలితంగా జపాన్ లో యువత, పిల్లల జనాభా లేక రానురాను వృద్ధుల సంఖ్య పెరుగుతూ మ్యాన్ పవర్ కొరత ఏర్పడుతోంది. ఇదే పరిణామం స్పెయిన్ సహా 23 దేశాల్లో ఉందని తేలింది.

తాజాగా వాషింగ్టన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ వర్సిటీ పరిశోధనలో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. అసలు ప్రస్తుత మహిళలు విద్యా, ఉద్యోగం అంటూ పిల్లలను కనడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదట.. ఇక 21 ఏళ్లకు ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు. పిల్లలను లేట్ గా కంటున్నారు. చాలా మంది కనడానికి ఇష్టపడడం లేదు. దీంతో జనాభా సంఖ్య ఆయా దేశాల్లో దారుణంగా పడిపోతోంది.

కొత్తగా పిల్లలను కనకపోవడంతో 2100 నాటికి ప్రపంచంలో 80 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య భారీగా పెరుగుతుందని వాషింగ్టన్ ఇన్ స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ వర్సిటీ పరిశోధనలో తేలింది. ముఖ్యంగా జపాన్, ఇటలీ, స్పెయిన్, థాయిలాండ్, పోర్చుగల్ దేశాల్లో భారీగా జనాభా తగ్గనున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఇండియా మాత్రం జనాభాలో చైనాను దాటేసి నంబర్ 1 ర్యాంకుకు చేరుకుంటుదట.. ఇలా ప్రపంచంలో వృద్ధులు పెరిగి.. యువత తగ్గిపోతారని అది పనిమీద ప్రభావం చూపుతుందని సర్వేలో తేలింది.