Begin typing your search above and press return to search.

జీహెచ్ఎంసీలో మ‌హిళా రాజ్యం..!

By:  Tupaki Desk   |   12 Feb 2021 5:30 PM GMT
జీహెచ్ఎంసీలో మ‌హిళా రాజ్యం..!
X
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలకమండలి ప్ర‌మాణ స్వీకారం ముగిసింది. మేయ‌ర్ ఎన్నిక కూడా పూర్త‌యింది. అయితే.. అంద‌రూ మేయ‌ర్‌, డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక‌పైనే దృష్టి పెట్టారు కానీ.. మ‌రో కీల‌క‌మైన అంశం కూడా అక్క‌డ క‌నిపించింది. అదేంటంటే.. జీహెచ్ఎంసీలో పెరిగిన మ‌హిళ‌ల బ‌లం!

గ్రేట‌ర్ లో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉండ‌గా.. అందులో స‌గానికి పైగా మ‌హిళ‌లు ఉండ‌డం విశేషం. వాస్త‌వానికి రిజర్వేషన్ ప్రకారం జీహెచ్ఎంసీలో 50 శాతం మహిళలు ఉండాల‌నుకుంటే.. 75 మంది మహిళలు ఎన్నిక కావాల్సి ఉంది. కానీ.. ఇప్పుడు గ్రేట‌ర్లో 80 మంది మహిళా కార్పొరేట్లు ఉన్నారు!

మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వేష‌న్ ప్ర‌కారం సీట్లు కేటాయించ‌డానికే ఆలోచించే వారు గ‌తంలో! కానీ.. ఇప్పుడు ఏకంగా అంత‌కు మించి మ‌హిళా స‌భ్యులు ఉండ‌డం విశేషం. దీంతో.. ప్ర‌మాణ స్వీకారం సంద‌ర్భంగా 150 మంది కార్పొరేటర్లలో సగం కంటే ఎక్కువగా మహిళలే క‌నిపించారు. వాస్త‌వానికి ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా వ‌స్తుంటాయి.

అంతేకాదు.. అటు మేయ‌ర్, డిప్యూటీ మేయ‌ర్ కూడా మ‌హిళ‌లే. దీంతో.. జీహెచ్ఎంసీలో మ‌హిళా రాజ్యం కొలువుదీరింద‌ని చెప్పొ‌చ్చు. మొత్తానికి.. ఇన్నాళ్లూ ఆధిప‌త్యం సాగించిన మ‌గాళ్ల‌ను గ్రేటర్ ఫైట్ లో ఓడించి, మహిళలు విజ‌యం సాధించార‌ని చెప్పుకోవ‌చ్చు. ఆ విధంగా.. పురుషుల‌ను 'తోసిరాణి'అంటున్న మహిళలు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారని ఆశిద్దాం.