Begin typing your search above and press return to search.
మీ పేరు రాసి చనిపోతాం: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్
By: Tupaki Desk | 15 Oct 2020 4:30 PM GMTహైదరాబాద్ క‘న్నీటి’ తడి ఆరడం లేదు. వాన తగ్గినా కాలనీల్లో వరద కొనసాగుతోంది. నాలాలు, డ్రైనేజీలు పెద్ద ఎత్తున పొంగి పొర్లుతున్నాయి. చిన్న చిన్న ఇళ్లు, అపార్ట్ మెంట్లు, సొంతంగా ఉన్న ఇళ్లలోకి కూడా వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలో నీళ్లతోనే హైదరాబాద్ జనాలు కాలం గడుపుతున్నారు. ఇంట్లోని సామాన్లన్నీ తడిచి మునిగిపోయాయి. దాంతో భారీ నష్టం చేకూరి లబోదిబోమంటున్నారు.
ఎన్నో కాలనీల్లో ప్రస్తుతం ఆరు నుంచి ఏడు అడుగుల మేర నీళ్లు చేరి పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. దాంతో ఎవ్వరూ బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. జనాలు ఇళ్లలోని నీటిని ఎత్తిపోయడం సాధ్యం కాక అక్కడ ఉండలేక మేడ మీదకు చేరుకొని అక్కడే కాలం గడుపుతున్నారు.
తాజాగా వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చుక్కెదురైంది. ఆయనకు మహిళలు షాకిచ్చారు.
ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి వెళుతున్న పడవని ఆపిన మహిళలు తమకు తినడానికి తిండి కూడా ఇవ్వలేదని.. ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. అయితే ఆయన సముదాయించాలని చూస్తున్నా వినకుండా మహిళలు బాధలు ఏకరువు పెట్టారు.
చివరకు ఎమ్మెల్యే వెళ్లబోతుండగా తమ బాధలు వినకుండా ఆత్మహత్య చేసుకుంటానని మహిళలు హెచ్చరించారు. చివరకు ఆయన తాను అన్నీ చేస్తానంటూ చెప్పి వెళ్లిపోయారు.