Begin typing your search above and press return to search.
మోడీ విమానాన్ని దిగనివ్వబోమన్న ఎమ్మెల్యే
By: Tupaki Desk | 6 March 2017 1:55 PM ISTప్రధాని మోడీ మాటకు బీజేపీలో తిరుగేలేదు. కానీ.. ఆ పార్టీకే చెందిన ఓ ఎమ్మెల్యే మాత్రం తమ డిమాండ్లు తీర్చుకోవడం కోసం మోడీకే అల్టిమేటం ఇచ్చారు. ఐఐటీ కోచింగ్ సెంటర్లకు పేరుగాంచిన రాజస్థాన్ లోని కోట ప్రాంతంలో సరైన విమానాశ్రయం లేకపోవడంతో అక్కడి ఎమ్మెల్యే మండిపడుతున్నారు. విమానాశ్రయం ఉన్నా అక్కడి నుంచి సర్వీసులు లేవని.. అలాంటప్పుడు దానివల్ల ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నిస్తున్నారు. దాన్ని డెవలప్ చేసేవరకు మోడీ వచ్చినా కూడా ఆయన విమానాన్ని దిగనివ్వబోమని అన్నారు.
రాజస్థాన్ లోని కోటలో ఇప్పటికీ సరైన ఎయిర్ పోర్టు లేదని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే భవానీసింగ్ రజావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రాంతం ఐఐటీ కోచింగ్ సెంటర్లకు ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడ పాస్ పోర్ట్ సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన భవానీ సింగ్ ఈ సందర్భంగా కేంద్రం తీరుపై మండిపడ్డారు. అక్కడి ప్రజల కోసం విమానాల సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చేవరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా ఏ వీవీఐపీని కూడా అక్కడ దిగనివ్వబోమని ఆయన ఫైరయ్యారు.
ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు లేకపోతే పాస్ పోర్టులు పెట్టుకుని జనం ఏం చేసుకుంటారని ఆయన నిలదీశారు. అక్కడి ఎయిర్‌పోర్టు వీవీఐపీలు, రాజకీయ నాయకుల కోసమే ఉన్నట్లుందని ఆయన మండిపడ్డారు. కోటలో చిన్న విమానాలు మాత్రమే ల్యాండ్ అవుతున్నాయని ఆయన చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే భవానీసింగ్ రజావత్ ఇంతకుముందు కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై బీజేపీ అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/