Begin typing your search above and press return to search.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే వర్సెస్ భూమా అఖిలప్రియ
By: Tupaki Desk | 15 Feb 2022 9:30 AM GMTరాయలసీమలోనే అత్యంత హీట్ పుట్టించే రాజకీయం కర్నూలు జిల్లాలో సాగుతుంది. అందునా ఆళ్లగడ్డ రాజకీయం రంజుగా ఉంటుంది. అక్కడ హేమాహేమీలు ఆదిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు. పాత పగలు చాలా అక్కడ ఇప్పటికీ రగులుతూనే ఉంటాయి. మాజీమంత్రి భూమా అఖిలప్రియ, వైసీపీ ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డిల మధ్య సవాళ్లు,ప్రతి సవాళ్ల యుద్ధం కొనసాగుతోంది. స్థానికంగా రోడ్లు వెడల్పు చేసే విషయంలో మొదలైన ఘర్షణ ఇరువురి మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది.
రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా ఫోర్ రోడ్ సర్కిల్ దగ్గర రెండు రోజుల క్రితం బస్ షెల్టర్ ను తొలగించే ప్రయత్నం చేశారు. భూమా నాగిరెడ్డి ప్రజల కోసం కట్టించిన బస్సు షెల్టర్ ను ఎలా తొలగిస్తారంటూ జగద్విఖ్యాత రెడ్డి అధికారులను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు భూమా జగద్విఖ్యాత రెడ్డిపై కేసు నమోదు చేయడం ఈ వివాదానికి కారణమైంది.
ఇక ఈ వ్యవహారంపై సీరియస్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. రోడ్డు వెడల్పు కార్యక్రమం పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. ఆళ్లగడ్డలో జరుగుతున్న అవినీతిని తాను నిరూపించలేకపోతే వైసీపీ నేతలు ప్రజలను లూటీ చేస్తున్నారని భూమా అఖిలప్రియ తీవ్రస్తాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలకు పరిహారం చెల్లించకుండా కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేస్తున్నారని ఆమె ఆరోపించారు.
రోడ్ల విస్తరణ పేరుతో ఎమ్మెల్యే బ్రిజేంద్ర రెడ్డి వసూళ్లకు పాల్పడుతున్నారని.. కలెక్టర్ విచారణ జరపాలని భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. తాను అవినీతిని నిరూపించలేకపోతే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని..అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేసే దమ్ము ఎమ్మెల్యేకి ఉందా? అని ప్రశ్నించారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. రాతపూర్వకంగా కలెక్టర్ కు ఇస్తానని వెల్లడించారు.
అవినీతికి పాల్పడలేదని చెప్పే ధైర్యం ఉంటే రాజీనామా పత్రం తీసుకొని కలెక్టర్ ముందుకు రావాలని భూమా అఖిలప్రియ సవాల్ చేశారు. ఈ వ్యవహారంపై రెండు రోజుల్లో కలెక్టర్ ను కలిసి ధర్నా చేస్తామని భూమా అఖిలప్రియ వెల్లడించారు.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డిపై భూమా అఖిలప్రియ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాము దానం చేసిన స్థలంలో కట్టిన స్టేడియానికి తన తండ్రి పేరు పెట్టుకున్నామని.. కానీ ప్రజాధనంతో మున్సిపల్ స్థలంలో కట్టిన ఆఫీసుకు ఎమ్మెల్యే తండ్రిపేరు పెట్టుకోవడం సిగ్గుచేటు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
-అవినీతిని నిరూపిస్తే రాజీనామా: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రరెడ్డి
అఖిలప్రియ చేసిన సవాల్ కు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి స్పందించారు. అవినీతి జరిగిందని ఆరోపణలను అఖిలప్రియ నిరూపిస్తే రాజీనామా చేయడానికి తాను సిద్ధమని చెప్పారు. ప్రజల ఆమోదంతోనే రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని..మురుగు కాలువల నిర్మాణ పనులు జరుగుతున్నాయని బిజేంద్రారెడ్డి అన్నారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బస్ షెల్టర్ కూల్చివేస్తామని చెప్పడం కరెక్ట్కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆక్రమణలను కూల్చివేస్తే నష్టపరిహారం ఎలా ఇస్తారో చెప్పాలని ప్రశ్నించారు. భూమా అఖిలప్రియ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అవినీతిపై కలెక్టర్ దగ్గర విచారణకు రెడీ అంటూ ప్రతిసవాల్ విసిరారు బిజేంద్రరెడ్డి.