Begin typing your search above and press return to search.
నాలుగేళ్ల లో కానిది.. కేటీఆర్ ను కలిసి ఇంటికి వచ్చేలోపు పూర్తి
By: Tupaki Desk | 1 Dec 2021 10:35 AM ISTతెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆరా? మజాకానా? ఆయన తలుచుకుంటే వ్యవస్థలు ఎంత వేగంగా పరుగులు తీస్తాయో చెప్పే ఉదంతంగా దీన్ని చెప్పాలి. నాలుగేళ్లుగా కాని పని.. ఆయన చేసిన ఒక్క ఫోన్ కాల్ తో అది కూడా రాకెట్ స్పీడ్ తో పూర్తి అయిన వైనం వింటే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ మధ్య విడుదలైన సివిల్స్ లో జాతీయ స్థాయిలో 20 ర్యాంకు సాధించిన డాక్టర్ శ్రీజ.. తాజాగా మంత్రి కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె సాధించిన విజయాన్ని అభినందించారు. పరిమితులు ఎన్ని ఉన్నా.. వాటిని అధిగమించి మరీ సాధించిన విజయాన్ని ప్రస్తావించి ప్రశంసించారు. మాటల మధ్యలో శ్రీజ కుటుంబ సభ్యుల వివరాలను మంత్రి కేటీఆర్ అడిగారు. ఇంతకూ మీ తల్లి దండ్రులు ఏం చేస్తుంటారని ప్రశ్నించారు.
తన తండ్రి ప్రైవేటు ఉద్యోగి అని.. తల్లి రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా పని చేస్తున్నారని.. వరంగల్ ఆమె ఉద్యోగమని శ్రీజ చెప్పింది. మీరుండేది హైదరాబాద్ లో.. మీ అమ్మ నిత్యం వరంగల్ వెళ్లి పని చేసి వస్తున్నారా? అని ప్రశ్నించగా.. నాలుగేళ్లుగా తన తల్లి బదిలీ వినతి చేస్తున్నామని.. కానీ ఫలితం లేదని ఆమె చెప్పారు. దీంతో.. ఆ సంగతి తాను చూస్తానని మాట ఇచ్చారు కేటీఆర్.
కట్ చేస్తే.. మంత్రి కేటీఆర్ ను కలిసి ఇంటికి వెళ్లిన శ్రీజకు.. అప్పటికే ఆమె తల్లికి వరంగల్ నుంచి నగరానికి బదిలీ చేస్తూ ఉత్తర్వు వెలువడిందన్న సంతోషకరమైన వార్త ఆమె చెవిన పడింది. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూ.. తమకున్న ఇబ్బందిని ఎంత చెబుతున్నా పట్టించుకోని ఉన్నతాధికారులు.. మంత్రి కేటీఆర్ నుంచి ఫోన్ వెళ్లిన నిమిషాల వ్యవధిలోనే ఆర్డర్ రావటం చూస్తే.. ఆయన ‘పవర్’ ఎంతన్న విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఇదంతా బాగానే ఉన్నా.. రూల్ ప్రకారం జరగాల్సిన ప్రొసీజర్.. మంత్రి కలుగజేసుకోకపోతే ఏళ్ల తరబడి.. మంత్రి పట్టించుకున్నంతనే నిమిషాల వ్యవధిలో జరిగిపోవటం చూస్తే.. వ్యవస్థలోని లోపం కళ్ల ముందు కదలాడినట్లుగా అనిపించట్లేదు?