Begin typing your search above and press return to search.

భవిష్యత్తులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఆఫీసుల పని అయిపోనట్టేనా?

By:  Tupaki Desk   |   19 April 2022 11:30 PM GMT
భవిష్యత్తులోనూ వర్క్ ఫ్రమ్ హోమ్.. ఆఫీసుల పని అయిపోనట్టేనా?
X
ఇక మీదట మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానమే కొనసాగించాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు యోచిస్తున్నాయి. ఈ హైబ్రిడ్ విధానాన్ని కొనసాగించాలని కంపెనీలు భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కరోనా సమయంలో ఉద్యోగులు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దాంతో ఇంటి నుంచే పని చేసే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి చాలా కంపెనీలు. ఈ వర్క్ ఫ్రమ్ హోం విధానం వల్ల లాక్ డౌన్ ప్రభావం చాలా వరకు తగ్గింది.

అయితే ప్రస్తుతం కరోనా ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టింది. చాలా కంపెనీలు ఆఫీసుకు రావాలని.. మరికొన్ని కంపెనీలు 15 రోజులు ఆఫీసులో మరో 15 రోజులు ఇంట్లో ఉండి పనిచేసే వెసులుబాటును కల్పించాయి. అయితే కరోనా ఉన్నా లేకపోయినా భవిష్యత్తులో కూడా వర్క్ ఫ్రమ్ ఫెసిలిటీని కంటిన్యూ చేయాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక కంపెనీలు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ హైబ్రిడ్ మోడల్ ను కొనసాగించాలని కంపెనీలు భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఎంప్లాయ్ షెడ్యూల్ లో ఇన్-ఆఫీస్, రిమోట్ వర్క్ ఫెసిలిటీని అందించేది ఈ హైబ్రిడ్ మోడల్. హైబ్రిడ్ మోడల్ ని కంటిన్యూ చేసేందుకు కంపెనీలు మొగ్గు చూపడానికి గల కారణాలు ఎంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

రిమోట్ వర్కింగ్ లేదా ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటేనే జాబ్ లో జాయిన్ అయ్యేందుకు ప్రస్తుతం ఉద్యోగులు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఇదొక ప్రధాన నియామక ప్రమాణంగా మారిందని రిక్రూటింగ్ మేనేజర్ల టాలెంట్ వర్క్స్ పోల్ లో తేలింది. అలాగే అమెరికా అంతటా నిర్వహించిన ఈ పోల్ లో 90 శాతం మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్ లు తెలిపారు. ఈ కారణంగా 93 శాతం యూఎస్ సంస్థలు నగరం లేదా రాష్ట్రం వెలుపల ఉన్న ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయడానికి సౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. ఓ సర్వే ప్రకారం 66 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా రిమోట్ వర్కర్లు తాము ఆన్ సైట్ లో కంటే ఇంటి వద్దే ఎక్కువ ప్రొడక్టివ్ గా ఉన్నట్లు తెలిపారు. దాదాుపు 75 శాతం మంది పార్టిసిపెంట్లు కూడా ఇల్లు లేదా వేరే ప్రాంతాల నుండైనా పని చేసే ఫెసిలిటీ ఉంటే తమ లైఫ్ మరింత ఈజీ అవతుందని చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉద్యోగుల ప్రొడక్టివిటీ పెరిగిందని 68 శాతం బిజినెస్ కంపెనీలు కూడా చెప్తున్నాయి.

అందుకే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్ తో సహా మేజర్ ఐటీ కంపెనీలు కూడా లాగ్ టర్మ్ హైబ్రిడ్ మోడల్ వర్క్ ను అమలు చేయాలని యోచిస్తున్నాయి. క్లయింట్లు, నియంత్రణ వాతావరణం.

ఇంకా అనేక ఇతర విషయాలను పరిగణలోకి తీసుకొని హైబ్రిడ్ మోడల్ ను ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నట్లు ఇన్ఫోసిస్ తెలిపింది. టీసీఎస్ కూడా ఆన్ సైట్, ఆన్ లైన్ వంటి డిఫరెంట్ వర్క్ మోడ్ లను ప్లాన్ చేస్తోంది. ఈ కంపెనీ ఫ్యూచరిస్టిక్, పాత్ బ్రేకింగ్ 25X25 మోడల్ ను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించింది.