Begin typing your search above and press return to search.
ఇంకో ఐదేళ్లు వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారంటే.. జరిగేది ఇదే!
By: Tupaki Desk | 4 July 2021 11:30 PM GMTకరోనా మహమ్మారి ప్రపంచంలో తెచ్చిన పెను మార్పుల్లో ఒకటి వర్క్ ఫ్రమ్ హోమ్. కొవిడ్ ధాటికి మనుషులు, సంస్థల ఆర్థిక వ్యవహారాలు మొత్తం తలకిందులు కావడంతో.. ప్రజల దైనందిన జీవితం మొత్తం మారిపోయింది. లాక్ డౌన్ వంటి కఠిన నిర్ణయాల ద్వారా ప్రపంచం మొత్తం నాలుగు గోడలకే పరిమితం కావాల్సి వచ్చింది.
జనాలు రోడ్లెక్కే అవకాశం లేకపోవడం.. ఆఫీసులకు వచ్చి కలిసి పనిచేసే ఛాన్స్ అంతకన్నా లేకపోవడంతో.. ఆయా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ కేటాయించాయి. దీంతో.. అందరూ ఇంటి నుంచే పనులు చేస్తున్నారు. దాదాపుగా కంపెనీలన్నీ తమ ఉద్యోగులేను ఇంటి నుంచే పనిచేయమంటున్నాయి. ఇప్పటికే.. చాలా కంపెనీల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
థర్డ్ వేవ్ అంటున్నందువల్ల చాలా కంపెనీలు.. వేచి చూస్తున్నాయి. మళ్లీ ఆఫీసులకు పిలవడం.. తేడా వస్తే మళ్లీ ఇళ్లకు పంపడం వంటి వాటితో.. డిస్ట్రబెన్స్ వస్తుందని వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ చేస్తున్నాయి. అయితే.. మొదట్లో చాలా మంది ఇంటి నుంచి పని అనే సరికి ఎగిరి గంతేశారు. కానీ.. రోజులు గడుస్తున్న కొద్దీ లెక్కలు మారిపోతున్నారు. రోజంతా ఇంట్లోనే ఉండడంతో.. భార్యాభర్తల మధ్య అనవసర కామెంట్లతో గొడవలు కూడా జరుగుతున్నాయని ఏకంగా నివేదికలే వచ్చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. మరో ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇంట్లోనే డ్యూటీ కావడంతో చాలా మంది ఆలస్యంగా నిద్ర లేవడం, శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడం, సమయానికి తినకపోవడం వంటివి చేస్తున్నారట. పైగా చాలా మంది జంక్ ఫుడ్ కు అలవాటు పడుతున్నారట. దీంతో.. కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు వస్తున్నాయట.
మరో ఐదేళ్లపాటు ఇదే పరిస్థితి కొనసాగితే.. ఎండకు వెళ్లకుండా ఉండడం వల్ల విటమిన్ డి లోపిస్తుందని అంటున్నారు. అదే జరిగితే.. శరీరం పాలిపోవడం, గూని వంటివి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నారు నిపుణులు. సో.. తప్పకుండా రెగ్యులర్ గా వ్యాయామం చేయండి. సమయానికి తినండి. టైమ్ టేబుల్ పెట్టుకొని, అన్నీ పర్ఫెక్ట్ చేయండి. అప్పుడే హెల్తీగా ఉంటారు.