Begin typing your search above and press return to search.
2022 డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోం .. ఎక్కడంటే?
By: Tupaki Desk | 25 Aug 2021 2:30 PM GMTకరోనా కారణంగా అనేక సంస్థలు వర్క్ ఫ్రం హోం విధానం ద్వారా తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. కరోనా మొదటి వేవ్ అనంతరం కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి చెప్పాలని భావించినా.. సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ లో పని భారం, మానసిక ఒత్తిళ్లు పెరుగుతున్నప్పటికీ కరోనా వైరస్ భయం, ఉద్యోగాల్లో అభద్రతా భావం, ఎక్కువ సేపు ఇంట్లోనే గడిపే వీలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, డబ్బు సేవింగ్స్, ఇతర పనులు చక్కబెట్టుకునే వీలు. తదితర కారణాలతో కట్టింగ్‌లు అయినా సరే 'వర్క్ ఫ్రమ్ హోం'కే ఉద్యోగులు మొగ్గుచూపిస్తున్నారు. ఇక డెల్టా వేరియెంట్ విజృంభణతో వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ను మరికొన్ని రోజులు వాయిదా వేశారు.
ఇదిలా ఉంటే .. వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ఇంటి నుంచి పనిచేయాలని బెంగళూరు ఐటీ కంపెనీలకు కర్ణాటక ప్రభుత్వం స్ఫష్టంచేశాయి. ఇందుకు గల కారణం కూడా వివరించింది. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనులు, బెంగళూరు మెట్రో పనుల వల్ల వర్క్ ఫ్రం హోం గడువు పెంచాలని స్పష్టంచేసింది. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాప్ట్‌వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ (నాస్కామ్)కు లేఖ రాసిందని డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలియజేసింది. సెంట్రల్ సిల్క్ బోర్డు నుంచి కేఆర్ పురం వరకు ఔటర్ రింగ్ రోడ్ పనులు జరుగుతున్నాయని వివరించింది.
దీంతో ఏడాదిన్నర నుంచి రెండేళ్ల వరకు జనం రద్దీ ఉండొద్దని అనుకుంటోంది. వర్క్ ఫ్రం హోం లేకుంటే.. చాలా రద్దీ ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ కూడా ఆరు లైన్లతో నిర్మిస్తున్నారు. ఒకవేళ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు కార్యాలయాలకు రావాలని కోరితే మాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. దీంతో నిర్మాణ పనులకు అంతరాయం కలుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణ పనుల వల్ల బసుల కోసం ప్రత్యేకంగా లైన్.. ఇతర వాహనాలను మరో దారి కూడా ఏర్పాటు చేశారు. దీంతో నిర్మాణ పనులకు ఇబ్బందులు లేకుండా జరుగుతాయి. దీంతో వచ్చే ఏడాది డిసెంబర్ వరకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు కర్ణాటక సర్కార్ ఐటీ, బీపీవో కంపెనీలను కోరింది. ఔటర్ రింగ్ రోడ్డు వెంటే అనేక ఐటీ సంస్థలు ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని తెలిపింది. తప్పనిసరిగా ప్రయాణించాల్సిన సామాన్య ప్రజల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఇచ్చిన వర్క్ ఫ్రం హోం సదుపాయాన్ని మరికొంత కాలం పొడిగిస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉంటాయని స్పష్టం చేసింది.