Begin typing your search above and press return to search.
డిసెంబరు వరకూ వర్క్ ఫ్రం హోం తప్పదట
By: Tupaki Desk | 14 May 2020 7:00 AM GMTలాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాపార.. వాణిజ్య సంస్థలు మూసివేయటం.. అత్యవసర సేవలకు మినహాయింపులు ఇవ్వటం తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన ఐటీ ఉద్యోగులకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్స్ బయటకు వచ్చింది. ఇప్పుడు అమలు చేస్తున్న ఇంటి నుంచి పని చేసే పద్దతిని.. రానున్న మరిన్ని నెలలు కంటిన్యూ చేస్తారని చెబుతున్నారు.
వరుస పెట్టి ప్రకటిస్తున్న లాక్ డౌన్ లతో ఇళ్ల నుంచే పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు.. ఇటీవల కొన్ని కంపెనీలు ఆఫీసుకు రావాలని కోరుతున్నాయి. ప్రభుత్వం సైతం 33 శాతం ఉద్యోగుల్ని పని ప్రదేశాలకు వచ్చేందుకు అనుమతిని ఇచ్చాయి. అయితే.. సర్కారు ఆదేశాల్ని పాటిస్తే లేనిపోని తిప్పలు తప్పవన్న ఆలోచనలో ఐటీ కంపెనీలు ఉన్నాయి. అందుకే.. ఆగస్టు వరకూ వర్క్ ఫ్రం హోంకు ఓకే చెప్పేసినట్లుగా తెలుస్తోంది.
పరిస్థితుల్లో మార్పులు రాకున్నా.. వ్యాక్సిన అందుబాటులోకి రాకున్నా.. ఇంటి నుంచి పని చేసే అవకాశాన్ని డిసెంబరు వరకూ కంటిన్యూ చేస్తారని చెబుతున్నారు. లాక్ డౌన్ వేళ.. వర్క్ ఫ్రం హోం ఎంతమేర వర్క్ వుట్ అవుతుందన్న సందేహాలు పలు ఐటీ కంపెనీలకు కలిగాయి. అనూహ్యంగా గడిచిన ఏడెనిమిది వారాల్లో అవుట్ పుట్ అదిరిపోయేలా వచ్చిందని చెబుతున్నారు.
లాక్ డౌన్ వేళ.. ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అన్న సందేహంతో పాటు.. కంపెనీ చేతిలో ఉన్న ప్రాజెక్టులకు ఏదైనా జరిగితే జీతాలకు ఎసరు వస్తుందన్న భయాందోళనలతో వర్క్ ఫ్రం హోం అద్భుతంగా సక్సెస్ అయ్యిందని చెబుతున్నారు. ఈ వాదనను ఐటీ వర్గాలు ఒప్పుకోవటం లేదు. సంక్షోభం ఎప్పుడు వచ్చినా తమ సత్తా చాటేందుకు ఐటీ ఉద్యోగులు సిద్ధంగా ఉంటారని.. తాజాగా అలాంటి పరిస్థితే నెలకొందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ఈ ఏడాది చివరి వరకూ వర్క్ ఫ్రం హోం మరెన్ని పరిణామాలకు కారణమవుతుందో చూడాలి.