Begin typing your search above and press return to search.

గూగుల్ నిర్ణయం తెలిస్తే.. వర్కు ఫ్రమ్ హోం చేసే వారికి షాకే

By:  Tupaki Desk   |   11 Aug 2021 2:49 AM GMT
గూగుల్ నిర్ణయం తెలిస్తే.. వర్కు ఫ్రమ్ హోం చేసే వారికి షాకే
X
కరోనా ముందు వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉన్నప్పటికి.. చాలా తక్కువ మందికి మాత్రమే ఆ సదుపాయాన్ని కల్పించారు. ఎప్పుడైతే మహమ్మారి విరుచుకుపడుతుందో.. అప్పటి నుంచి ఐటీతో సహా అన్ని కంపెనీలు తమ ఉద్యోగుల్ని వర్క్ ఫ్రం హోంలోకి కన్వర్ట్ చేశాయి. గడిచిన ఏడాదిన్నరగా ఈ విధానంలో పని చేయటం చాలామందికి అలవాటుగా మారింది. అయితే.. ఇలా ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులకు దిమ్మ తిరిగేలా షాకిచ్చింది గూగుల్.

ఇంటి నుంచి పని చేసే ఆప్షన్ తీసుకున్న తన ఉద్యోగుల జీతాల విషయంలో ‘కోత’ తప్పదన్న విషయాన్ని తాజాగా స్పస్టం చేసింది. ఇంటి నుంచి పని చేసే విధానానికి అలవాటు పడిన కొందరు.. శాశ్వితంగా ఇంటినుంచే పని చేస్తామని చెబుతున్న వేళ.. గూగుల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనిపై ఐటీ ఉద్యోగుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అమెరికాలోని ఐటీ కంపెనీలకు నెలువుగా ఉండే సిలికాన్ వ్యాలీలో ఇప్పుడీ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే ఫేస్ బుక్.. ట్విటర్ లాంటి సంస్థల్లో పని చేసే ఉద్యోగులు రిమోట్ కు వెళ్లి పని చేస్తున్న వారి జీతాల్లో కోత పెట్టిన వైనం తెలిసిందే. తాజాగా గూగుల్ కూడా అదే బాట పట్టింది. తమ ఉద్యోగుల్ని ట్రాక్ చేసే విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న గూగుల్.. పది నుంచి పదిహేను శాతం వరకు వేతనాల్లో కోతను విదించాలని నిర్ణయించారు. ఉద్యోగులకు చెల్లించే ప్యాకేజీలన్ని కూడా వారుండే ప్రాంతానికి అనుగుణంగా ఉంటాయని చెబుతోంది.

గూగుల్ లాంటి కంపెనీనే.. ఇంటినుంచి పని చేసే వారికి చెల్లించే జీతాల్లో కోత పెట్టటం షురూ చేస్తూ.. మిగిలిన కంపెనీలు మరింత దూకుడుగా ఇదే విధాన్ని అమలు చేయటం ఖాయం. మన దేశీయ టెక్ కంపెనీలు గూగుల్.. ఫేస్ బుక్.. ట్విటర్ సంస్థలు అమలు చేస్తున్న కోత విధానం గురించి తెలిస్తే.. వెంటనే అమల్లోకి తీసుకురావటం ఖాయం. ఈ తీరు ఐటీ ఉద్యోగుల్లో కొత్త ఆందోళనకు గురి చేస్తోంది.