Begin typing your search above and press return to search.
ఆ దేశం లో వారం లో 4 రోజు లే పని, రోజుకు 6 గంటలే!
By: Tupaki Desk | 6 Jan 2020 6:58 AM GMTప్రపంచం లో ప్రగతి పరంగా ముందున్న దేశాల్లో ఒకటైన ఫిన్లాండ్ ఒక ఆసక్తిదాయకమైన నిర్ణయాన్ని తీసుకుంది. తమ దేశంలో వారానికి నాలుగు పని దినాలనే ఖరారు చేసింది. అంతే కాదు.. రోజుకు పని గంటల సంఖ్య ఆరు మాత్రమే అని ఆ దేశ ప్రధాని ప్రకటించారు. ప్రపంచ వ్యాప్తం గా ఏ దేశంలోనూ లేని రీతిలో ఇలా వారానికి నాలుగు పనిదినాలు, రోజుకు ఆరు గంటల పని గంటలను ప్రకటించి ఫిన్లాండ్ వార్తల్లోకి ఎక్కింది.
పలు టెక్ దిగ్గజాలకు కేరాఫ్ ఫిన్లాండే. ఇండియాలో ఒకప్పుడు భారీ మార్కెట్ ను కలిగి ఉండిన నోకియా కూడా ఫిన్లాండ్ కు చెందిన కంపెనీనే.
తమ దేశానికి చెందిన ప్రజల వ్యక్తిగత, కుటుంబ జీవితాలు బావుండాలనే పని గంటలను కుదించినట్టు గా ఆ దేశ ప్రధాని ప్రకటించారు. కేవలం ముప్పై నాలుగు సంవత్సరాలున్న వ్యక్తి ఫిన్లాండ్ ప్రధాని గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఆసక్తి దాయకమైన నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రజలు తమ తమ కుటుంబాల తో సంతోషం గా గడపాలని.. అందుకే పని గంటలను కుదించినట్టు గా ఆయన ప్రకటించారు. భారీ ఎత్తున కార్మికులు అందుబాటు లో ఉన్న ఇండియా లో .. మనుషుల చేత వెట్టి చాకిరీ చేయించుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ఇండియాలో చాలా రంగాల్లో పని గంటలు అనే నియమమే లేకుండా ఉంది. జీతభత్యాల విషయంలో వెనుకబడే ఉన్న మన దేశంలో పని గంటల విషయంలో మాత్రం చాలా పట్టింపులుంటాయి. మరి మన దేశం ఎన్నటికి ఫిన్లాండ్ వంటి పరిస్థితుల కు చేరుతుందో!