Begin typing your search above and press return to search.
లైంగిక వేధింపుల కేసు .. భారీ పరిహారం అందుకున్న సెక్స్ వర్కర్
By: Tupaki Desk | 15 Dec 2020 12:30 AM GMTన్యూజీలాండ్ లో ఒక యజమాని తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కేసు వేసిన ఒక సెక్స్ వర్కర్ తాజాగా ఆరంకెల భారీ మొత్తాన్ని పరిహారంగా అందుకున్నారు. మహిళ భావోద్వేగాలకు హాని కలిగించి, ఆదాయం కోల్పోయేలా చేశారంటూ వేసిన ఈ కేసు సెటిల్ మెంట్ లో భాగంగా బాధితురాలికి ఈ మొత్తం అందినట్లు ఆమె తరపున వాదించిన ఒక మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. వేశ్యా వృత్తిని నేరంగా చూడకూడదని చెబుతూ 2003లో న్యూజీలాండ్ ఒక చట్టం ఆమోదించింది. ఈ కేసులో విచారణ వివరాలను, వాదులు, ప్రతివాదుల గుర్తింపును రహస్యంగా ఉంచారు.
కానీ, ఈ కేసులో సోమవారం ఇచ్చిన తీర్పును వేశ్యావృత్తిలో ఉన్న వారి హక్కులకు సంబంధించి ఒక మైలురాయిగా భావిస్తున్నారు. వేశ్యావృత్తిలో ఉన్న ఒక సెక్స్ వర్కర్ కు ఇలాంటి పరిష్కారం అందించడం చాలా గొప్ప విషయం. మనం ఏ పని చేస్తున్నా, అక్కడ జరిగే అన్యాయాన్ని ఎదుర్కోడానికి ఇలాంటివి ధైర్యాన్ని ఇస్తాయి. ఈ వ్యాపారాల్లో ఉన్నవారికి ఇది మేలుకొలుపు అని న్యూజీలాండ్ లో సెక్స్ వర్కర్ల హక్కుల కోసం ఉద్యమించే డేమ్ కేథరీన్ హీలే అన్నారు. 2003లో ఆమోదించిన ఈ చట్టంతో వేశ్యాగృహాల్లో వ్యాపారం చట్టబద్ధం అయ్యింది. సెక్స్ వర్కర్లకు పూర్తి ఉపాధి హక్కులను అందాయి.
పనితో సంబంధం లేకుండా కార్మికులందరికీ పనిచేసే చోట లైంగిక వేధింపుల నుంచి విముక్తి పొందే హక్కు ఉంది. వ్యాపార సంస్థల యజమానులు, యాజమాన్యాలు ఆ హక్కులను గౌరవించడాన్ని మేం ప్రోత్సహిస్తాం అని న్యూజీలాండ్ మానవ హక్కుల కార్యాలయం డైరెక్టర్ మైకేల్ టిమ్మిన్స్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.