Begin typing your search above and press return to search.

కార్మికులు హ్యాపీ.. సీఎం హ్య‌పీ.. మ‌రి జ‌నాలు?

By:  Tupaki Desk   |   29 Nov 2019 4:48 AM GMT
కార్మికులు హ్యాపీ.. సీఎం హ్య‌పీ.. మ‌రి జ‌నాలు?
X
మొత్తానికి తెలంగాణ‌లో ఆర్టీసీ స‌మ్మెకు సంబంధించి ప్ర‌తిష్టంభ‌న వీడింది. దాదాపు రెండు నెల‌ల స‌మ్మెకు గురువారంతో తెర‌ప‌డింది. ఆర్టీసీ కార్మికుల్ని ఏ ష‌ర‌తులూ లేకుండా ఉద్యోగాల్లోకి తీసుకుంటామ‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌క‌టించారు. అనేక డిమాండ్ల‌తో స‌మ్మెకు వెళ్లి.. చివ‌రికి ఆ డిమాండ్ల‌న్నీ ప‌క్క‌న పెట్టి త‌మ‌ను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుంటే చాల‌ని వేడుకునే వ‌ర‌కు వెళ్లారు కార్మికులు. వారు కోరుకున్న‌ది జ‌రిగింది. కార్మికుల డిమాండ్ల‌కు అస్స‌లు త‌లొగ్గ‌కుండా తన పంతం నెగ్గించుకున్నాడు కేసీఆర్. ఆర్టీసీని న‌ష్టాల్లోంచి బ‌య‌ట‌ప‌డేయ‌డానికి ఆయ‌న ఛార్జీలు పెంచుకునే అవ‌కాశం కూడా క‌ల్పించేశారు. కిలోమీట‌రుకు 20 పైస‌ల ఛార్జీల పెంపు గురించి సంకేతాలు కూడా ఇచ్చేశారు. కార్మికుల‌కు బోన‌స్ వ‌రాన్ని కూడా ప్ర‌క‌టించారు. మొత్తానికి ఇటు కేసీఆర్, అటు ఆర్టీసీ కార్మికులు హ్యాపీ.

ఇంత‌కీ స‌మ్మె వ‌ల్ల ఏం జ‌రిగింది? దీని వ‌ల్ల ఇబ్బంది ప‌డ్డ‌దెవ‌రు? ప‌డ‌బోయేదెవ‌రు అంటే మాత్రం జ‌నాలు అనేది స్ప‌ష్టం. ద‌స‌రా, బ‌తుక‌మ్మ‌, దీపావ‌ళి లాంటి పండుగ సీజ‌న్ల‌లో బ‌స్సులు లేక జ‌నాలు ప‌డ్డ అవ‌స్థ‌లు అన్నీ ఇన్నీ కావు. ఈ రెండు నెల‌ల్లో స‌మ్మె వ‌ల్ల జ‌నాల‌కు డ‌బ్బుల‌తో పాటు స‌మ‌యం వృథా అయింది. ఎంతో అసౌక‌ర్యానికి గుర‌య్యారు. నానా అవ‌స్థ‌లు ప‌డ్డారు. ఇది చాల‌ద‌న్న‌ట్లు ఇప్పుడు ఛార్జీల పెంపు అంటూ బాంబు పేల్చారు సీఎం. ఈ భారాన్ని మోయాల్సింది జ‌నాలే. మొత్తానికి స‌మ్మె వ‌ల్ల జ‌నాలు ఇప్ప‌టిదాకా ప‌డ్డ ఇబ్బందులు చాల‌వ‌ని.. ఇక ముందూ ఇబ్బంది ప‌డాల‌న్న‌మాట. ఇదెక్క‌డి న్యాయం అన్న‌ది అని కేసీఆర్‌ను అడిగేవాళ్లెవ్వ‌రు?