Begin typing your search above and press return to search.
భారత్ కు భారీ సాయం అందించిన ప్రపంచ బ్యాంకు !
By: Tupaki Desk | 15 May 2020 8:30 AM GMTచైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి దెబ్బకి ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు వణికిపోతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయంగా ఈ వైరస్ మరణాలు 3 లక్షల మార్క్ పైకి చేరాయి. ఇక ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 45 లక్షలు దాటేసింది. మన దేశంల కూడా ఈ వైరస్ వేగంగానే విస్తరిస్తూ వస్తోంది. భారత్ లో ఈ మహమ్మారి పాజిటివ్ కేసులు 82,103కి చేరాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భారత్ కు శుభవార్త అందింది.
ఈ వైరస్‌పై పోరుకు ప్రపంచ బ్యాంకు తాజాగా భారత్ కు బిలియన్ డాలర్ల అత్యవసర ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మన కరెన్సీలో దాదాపు రూ.7,500 కోట్ల సాయం. హెల్త్ సెక్టార్‌కు సంబంధించి వరల్డ్ బ్యాంక్ నుంచి భారత్‌కు అందుతున్న అతిపెద్ద ఆర్థిక సాయం ఇదే కావడం గమనార్హం.ఈ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సోషల్ ప్రొటెక్షన్ ప్యాకేజీ కింద రూ. 7,500 కోట్ల ప్రకటించింది. దీనివల్ల జనజీవన ప్రమాణాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయని వరల్డ్ బ్యాంక్ సోషల్ ప్రొటెక్షన్ గ్లోబల్ డైరెక్టర్ రుట్కోస్కీ తెలిపారు. వరల్డ్ బ్యాంకు విడుదల చేసిన ఈ నిధులని ఆరోగ్యం, సామాజిక రక్షణ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కో ఖర్చు చేయనున్నట్లు వారు బ్యాంక్ భారత ప్రతినిధి తెలిపారు.
ఈ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవటానికిగాను భారత్ కు ఏప్రిల్ ప్రారంభంలో 1 బిలియన్ డాలర్ల అత్యవసర సహాయాన్ని ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. తాజాగా మరో బిలియన్ డాలర్లు అందివ్వ నుంది. అలాగే ఎంఎస్ ఎంఈ ల కోసం మూడవ ప్యాకేజీ కూడా రానుదని భావిస్తున్నారు. సోషల్ ప్రొటక్షన్ పథకం కింద ఆయా దేశాలకు వరల్డ్ బ్యాంకు నిధులను సమాకూరుస్తున్నసంగతి తెలిసిందే