Begin typing your search above and press return to search.

స్యూల్స్‌ రీ ఓపెన్‌ పై ప్రపంచ బ్యాంక్ కీలక ప్రకటన

By:  Tupaki Desk   |   4 Oct 2021 11:30 PM GMT
స్యూల్స్‌ రీ ఓపెన్‌ పై  ప్రపంచ బ్యాంక్ కీలక ప్రకటన
X
కరోనా వైరస్ మహమ్మారి నుండి ఇప్పుడిప్పుడే ప్రపంచదేశాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. ఇంకా చాలా దేశాల్లో భయంకర స్థాయిలోనే కరోనా ఉంది. అయినప్పటికీ, స్కూల్స్‌ తెరవాల్సిందే అంటోంది ప్రపంచ బ్యాంక్. చిన్నారులు ఈ వైరస్‌ బారినపడే అవకాశాలు తక్కువేనని తన తాజా నివేదికలో తెలిపింది. టీకాల పంపిణీ చేసేవరకూ పాఠశాలలు తెరవకుండా ఉండాల్సిన అవసరం లేదని చెబుతోంది. వ్యాక్సిన్‌ రూపొందించక ముందే చాలాదేశాల్లో పాఠశాలలు తెరిచినప్పటికీ, పరిస్థితులేమీ పెద్దగా విషమించలేదని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది.

కరోనా వైరస్‌ తీవ్రతను తగ్గించే వ్యూహాలను అమలు చేయాలని, అదే సమయంలో పాఠశాలలు తిరిగి ప్రారంభించడం వల్ల పిల్లలు, సిబ్బంది మధ్య వైరస్‌ వ్యాప్తి చెందే ప్రమాదం తక్కువేనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించింది. ముఖ్యంగా ప్రీ-పైమరీ, ప్రైమరీ పాఠశాలల్లోనూ వైరస్‌ సంక్రమణ తక్కువగానే ఉందని తెలిపింది. పాఠశాల సిబ్బందికి మాత్రమే తోటి సిబ్బంది నుంచి వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుందని, పిల్లల నుంచి కాదని ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేసింది. దేశంలో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. తెలుగురాష్ట్రాల్లోనూ స్కూల్స్‌ ప్రారంభించారు.

అయితే తెలంగాణలో విద్యార్థులను బడులకు రావాలంటూ బలవంతం చేయవద్దని,ఆన్‌ లైన్‌ లోనూ క్లాసులు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలివ్వడంతో, అలాగే క్లాసులు జరుగుతున్నాయి. అయితే, పాఠశాలలను మూత వేయడం వల్ల వైరస్‌ సంక్రమణ ముప్పును మాత్రమే తొలగిస్తుందని కానీ, దీనివల్ల పిల్లల అభ్యాసన, మానసిక ఆరోగ్యంతో పాటు వారి పూర్తి అభివృద్ధికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని ప్రపంచ బ్యాంకు అభిప్రాయపడింది. స్కూళ్లు తెరిస్తే వచ్చే ముప్పు కంటే అవి తెరవకపోవడం వల్ల కలిగే నష్టాలే అధిక రెట్లు ఎక్కువని స్పష్టం చేసింది. అందువల్ల కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించే వ్యూహాలను అమలు చేస్తూ విద్యా సంస్థలు ప్రారంభించాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.

మన దేశంలో ఇప్పటి వరకు 3,38,13,903 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో 3,30,94,529 మంది కోలుకోగా.. 4,48,817 మంది మరణించారు. ప్రస్తుతం భారత్‌ లో 2,70,557 యాక్టివ్ కేసులున్నాయి. కేరళలో నిన్న 13,217 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అంటే దేశంలో నమోదైన కేసుల్లో సగానికిపైగా ఇక్కడే ఉన్నాయి. కేరళ తర్వాతి స్థానంలో మహారాష్ట్ర ఉంది. అక్కడ 2,696 మందికి పాజిటివ్ వచ్చింది. శనివారం దేశవ్యాప్తంగా 12,65,734 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. టెస్ట్ పాజిటివిటీ రేటు 1.70శాతంగా ఉంది. గత 6 రోజులుగా 2శాతం కంటే తక్కువగానే నమోదవుతోంది. ఇక వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. నిన్న 73,76,846 మందికి టీకాలు వేశారు. ఇప్పటి వరకు మనదేశంలో 90.51 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు.