Begin typing your search above and press return to search.
మోడీకి ఆయన వీర ఫ్యాన్ అంట
By: Tupaki Desk | 1 July 2016 6:37 AM GMTప్రధాని మోడీ పాలన గురించి అడిగే ఓకే చెప్పేవాళ్లు కనిపించినట్లే.. పెదవి విరిచే వారూ కనిపిస్తారు. కొన్ని అంశాలు తప్పించి.. అన్ని అంశాల్లో ఆయన దేశ ప్రజల్ని సంతృప్తి పర్చలేకపోయారనే చెప్పాలి. చివరకు ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో సైతం.. విదేశాంగ విధానం లాంటి కొన్ని అంశాలు తప్పించి మిగిలిన వాటి విషయంలో మోడీ అంతగా ప్రభావం చూపించలేకపోయారన్న పెదవి విరుపు కనిపించింది. దేశ ప్రజల మనోగతం ఇలా ఉంటే.. ప్రపంచానికి అప్పులిచ్చే ప్రపంచ బ్యాంక్ ఛైర్మన్ మాట మాత్రం మరోలా ఉంది.
ప్రధానిగా మోడీ తన సత్తా చాటటమే కాదు.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచే కొత్త పథకాల్ని ప్రకటించారని.. వాటిని నిరాఘాటంగా తీసుకెళ్లేందుకు వీలుగా పక్కా ప్రణాళికల్ని రచిస్తూ.. మంచి ఫలితాలు రాబడుతున్నట్లుగా పొగిడేశారు. మోడీ పని తీరు పట్ల విశ్వవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నట్లుగా పేర్కొన్న ప్రపంచ బ్యాంక్ ఛైర్మన్ జియ్ యాంగ్ కిమ్.. ‘‘ఆయనకు నేను వీరాభిమానిని’’ అని వ్యాఖ్యానించటం విశేషం.
ప్రపంచ బ్యాంక్ ఛైర్మన్ గా ఉన్న వ్యక్తి మోడీని అదే పనిగా పొగిడేయటం చూస్తుంటే.. ఆయన వ్యాఖ్యల వెనుక మర్మమేమిటన్నది ఇప్పుడు సక్తికరంగా మారాయి. మోడీతో ప్రత్యేకంగా భేటీ ఆయిన ఆయన.. గొప్ప గొప్ప నాయకులు చేయాలనుకున్న పనిని మోడీ చేసినట్లుగా చెప్పిన ఆయన.. డెడ్ లైన్ పెట్టుకొని లక్ష్యాల్ని పూర్తి చేసేలా అధికారుల్ని.. ఉద్యోగుల్ని బాధ్యుల్ని చేస్తున్నారన్నారు. ఒక భారత ప్రధానిని ప్రపంచ బ్యాంక్ ఛైర్మన్ ఈ తీరులో పొగిడేయటం ఇప్పుడాసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.