Begin typing your search above and press return to search.

ఆర్థిక మాంద్యం గుప్పిట్లోకి ప్ర‌పంచం.. వ‌రల్డ్ బ్యాంకు హెచ్చ‌రిక‌

By:  Tupaki Desk   |   15 Oct 2022 2:30 AM GMT
ఆర్థిక మాంద్యం గుప్పిట్లోకి ప్ర‌పంచం.. వ‌రల్డ్ బ్యాంకు హెచ్చ‌రిక‌
X
"అప్పులు చేస్తే.. త‌ప్పేంటి?`` అని ఎదురు ప్ర‌శ్నిస్తూ.. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మారుస్తున్న ప్ర‌భుత్వాల‌కు.. ప్ర‌పంచ బ్యాంకు క‌ర్ర‌కాల్చి వాత పెట్టింది. అప్పులు చేయ‌డం వ‌ల్లే.. ఆయా దేశాలు.. రాష్ట్రాలు.. ఊబిలో చిక్కుకుంటున్నాయ‌ని.. ప్ర‌జ‌ల‌ను వీధిలోకి నెడుతున్నాయ‌ని నిష్క‌ర్ష‌గా వ్యాఖ్యానించింది. ఎడా పెడా అప్పులు చేయ‌డం.. రుణాలు పెంచ‌డం.. వాటికి వ‌డ్డీలు చెల్లించేందుకు మ‌ళ్లీ అప్పులు చేయ‌డం వంటివి సంస్కృతి పెరుగుతుండ‌డాన్ని తీవ్ర‌స్థాయిలో దుయ్య‌బ‌ట్టింది. ఇది స‌రైన విధానం కాద‌ని హెచ్చ‌రించింది. అప్పులు కాదు.. ఆదాయం పెంచాల‌ని ప్ర‌పంచ దేశాల‌కు వ‌రల్డ్ బ్యాంకు సూచించింది.

ప్ర‌పంచ దేశాలు ఆర్థిక మాంద్యం చిక్కుల్లో ప‌డుతున్నాయ‌ని.. ఇప్పుడే.. అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని.. ప్ర‌పంచ బ్యాంకు హెచ్చ‌రించింది. ముఖ్యంగా ఈ మాంద్యం ఛాయ‌లు.. పేద‌ల‌పైనా.. పేద దేశాల‌పైనే ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిపింది. ఆయా దేశాల‌ను ఆదుకోవాల్సిన అవ‌స‌రం అభివృద్ధి చెందిన దాశాల‌పై ఉంద‌ని పేర్కొంది. ఈ మేర‌కు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు డేవిడ్ మల్‌పాస్ ప్ర‌పంచ దేశాల‌కు కొన్ని సూచ‌న‌లు చేశారు. 2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటును 3 శాతం నుంచి 1.9 శాతానికి కుదించిన విషయాన్ని గుర్తుచేశారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు, పెట్టుబడుల కోత.. వంటి సమస్యలు పేదవర్గాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని మల్‌పాస్‌ అన్నారు. ఇది ప్రపంచ బ్యాంక్‌ ఎందుర్కొంటున్న అతిపెద్ద సవాల్‌ అని తెలిపారు. దీని పరిష్కారానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఒక్కో దేశంలో ఒక్కో తరహా సమస్య ఉందని.. వాటికి అనుగుణంగా పరిష్కారాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటికే కొన్ని దేశాలు వడ్డీరేట్లను పెంచడం ప్రారంభించినట్లు తెలిపారు. వీటిలో కొన్ని మరిన్ని పెంపులు చేపట్టలేని స్థితికి చేరాయన్నారు.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యానికి అత్యంత దగ్గరగా ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పేదలను లక్ష్యంగా చేసుకొని వారికి మద్దతునందించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. 2023లో ప్రపంచ ఆర్థిక వృద్ధిరేటును 3 శాతం నుంచి 1.9 శాతానికి కుదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. వాషింగ్టన్‌లో ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక సదస్సు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు అభివృద్ధి చెందుతున్న దేశాలను కలవరపెడుతున్న మరో సమస్య `రుణభారం` అని మల్‌పాస్‌ తెలిపారు. భారీ ఎత్తున రుణం తీసుకోవడమే పెద్ద సమస్య అయితే.. దానిపై అధిక వడ్డీలు పరిస్థితిని మరింత జటిలం చేశాయన్నారు. ఆయా దేశాల కరెన్సీలు బలహీనంగా మారడం మరో పెద్ద సవాల్‌గా పరిణమించిందన్నారు. దీంతో అప్పులభారం మరింత తీవ్రమైందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఐదో రుణ సంక్షోభాన్ని చూస్తున్నామని తెలిపారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.