Begin typing your search above and press return to search.

మ‌న‌దేశంలోని సంపన్నుల గురించి సంచ‌ల‌న నిజం

By:  Tupaki Desk   |   21 Jan 2019 10:50 AM GMT
మ‌న‌దేశంలోని సంపన్నుల గురించి సంచ‌ల‌న నిజం
X
స‌మస‌మాజం అంటూ కొన్ని నినాదాలు నిత్య‌నూత‌నంగా చెలామ‌ణిలో ఉంటున్న‌ప్ప‌టికీ...మ‌రోవైపు దీనికి భిన్న‌మైన ప‌రిస్థితులు కొన‌సాగ‌తున్నాయి. తాజాగా ఈ ఒర‌వ‌డిలో ఓ చేదునిజం బ‌య‌ట‌ప‌డింది. మ‌న దేశంలో సంప‌న్నులే మ‌రింత ధ‌న‌వంతులుగా మారుతున్నారని మ‌రోమారు స్ప‌ష్ట‌మైంది. దేశంలో ఒక శాతం ఉన్న సంప‌న్నులు.. గ‌త ఏడాదిలో త‌మ సంప‌ద‌ను 39 శాతం పెంచేసుకున్నారు. బ్రిట‌న్‌కు చెందిన ఆక్స్‌ ఫామ్ సంస్థ త‌న నివేదిక‌లో ఈ క‌ఠోర నిజాన్ని వెల్ల‌డించింది.

వ‌ర‌ల్డ్ ఎక‌నామిక్ ఫోర‌మ్ స‌ద‌స్సు దావోస్‌ లో జ‌రుగుతున్న నేప‌థ్యంలో.. ఆక్స్‌ ఫామ్ సంస్థ ఈ నివేదిక‌ను రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్ర‌కారం, భార‌త‌దే దేశ జ‌నాభాలో దిగువ స్థానంలో ఉన్న పేద‌లు మాత్రం కేవ‌లం మూడు శాతం మాత్ర‌మే త‌మ సంప‌ద‌ను పెంచుకున్న‌ట్లు ఆక్స్‌ ఫామ్ సంస్థ తెలిపింది. భార‌త్‌లో ఉన్న 13.6 కోట్ల మంది, అంటే దేశ జ‌నాభాలోని ప‌ది శాతం మంది, 2004 నుంచి ఇంకా అప్పుల్లోనే ఉన్నార‌ని ఆ సంస్థ పేర్కొన్న‌ది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా బిలియ‌నీర్ల సంప‌ద 12 శాతం పెరిగింది. అది ఒక రోజు 2.5 బిలియ‌న్ల డాల‌ర్లు అని ఆక్స్‌ఫామ్ పేర్కొన్న‌ది. ఇక ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న పేద‌లు మ‌రింత దిగ‌జారారు.

వాళ్లు త‌మ సంప‌ద‌ను 11 శాతం కోల్పోయారు. పేద‌-ధ‌నిక మ‌ధ్య అంత‌రం పెరుగుతున్న‌ద‌ని, దాని వ‌ల్లే విభిన్న దేశాల్లో ప్ర‌జ‌లు ఆగ్ర‌హానికి లోన‌వుతున్న‌ట్లు తెలిపింది. భార‌త్‌లో సంప‌న్నులే మ‌రింత ధ‌న‌వంతులుగా మారుతున్నార‌ని, పేద‌లు మాత్రం తిండి కోసం ఇబ్బందిప‌డుతున్నార‌ని, వాళ్లు క‌నీసం పిల్ల‌ల‌కు మందులు కూడా కొన‌లేని ప‌రిస్థితిలో ఉన్నార‌ని ఆక్స్‌ఫామ్ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ విన్నీ బాన్యియామా తెలిపారు. ధ‌నిక‌, పేద‌ల మ‌ధ్య అంత‌రం పెరిగితే, అప్పుడు సామాజిక‌, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ కుప్ప‌కూలుతుంద‌ని ఆమె హెచ్చ‌రించారు. ప్ర‌పంచ కుబేరుడు జెఫ్ బీజోస్ సంప‌ద 112 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉంది. ఇది ఇథోపియా హెల్త్ బ‌డ్జెట్‌తో స‌మానంగా ఉంద‌ని ఆక్స్‌ఫామ్ తెలిపింది.