Begin typing your search above and press return to search.
ప్రపంచంలో తొలి సెక్స్ గురు భారతీయుడేనట!
By: Tupaki Desk | 2 Feb 2020 4:10 AM GMTసెక్స్....అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే రతి....వీటి గురించి మాట్లాడడానికి సగటు భారతీయుల్లో చాలామందికి మొహమాటం...బిడియం...సిగ్గుతో కూడిన రకరకాల ఎమోషన్స్ అడ్డొస్తుంటాయి. కానీ, పాశ్యాత్య దేశాల వారు సెక్స్, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడనికి ఏమాత్రం సంకోచించరు. అందుకే, చాలామంది పాశ్యాత్య దేశాలను ఉదహరిస్తూ కొందరు భారతీయులను ఎద్దేవా చేస్తుంటారు. అయితే, అసలు సెక్స్‌కు విశ్వ గురువు ప్రాచీన భారతదేశమే అన్న సంగతి చాలామందికి తెలియదు. కొన్ని వందల ఏళ్ల క్రితమే గ్రీకు సాహిత్యంలో ఉన్న 'కామం' అనే భావన గురించి కామసూత్ర రాసిన వాత్స్యాయనుడు విస్తృతంగా చర్చించాడన్న సంగతి అసలు తెలియదంటే అతిశయోక్తి కాదు.
క్రీ.శ 325లో శరీరం ఒక పనికిరాని వస్తువని, దాన్ని పొందాలనే కోరిక కలగడం పాపం అని, సెక్స్ ఒకే ఒక ఉద్దేశం సంతానానికి జన్మనివ్వడం మాత్రమే అని కాథలిక్ చర్చి తమ నియమ నిబంధనల్లో చెప్పింది. దాదాపు అదే సమయంలో వాత్స్యాయనుడు గంగా తీరంలో కూచుని కామసూత్ర రాస్తున్నారు. లైంగికానందం చాలా మంచిదని, దానిని మరింత పెంచడం ఎలా అనే అంశాలను రాశారట. ప్రాచీన భారతంలో దేవాలయాల్లో, అజంతా, ఎల్లోరా గుహల్లో కూడా యువతుల నగ్న వర్ణనలు, విగ్రహాలు కనిపిస్తాయి. భారతదేశంలో స్వలింగ సంపర్కం ఇప్పటికీ చట్టప్రకారం నేరం. కానీ, ఇదే దేశంలో ప్రాచీన భారతంలో దీనికి సామాజిక గుర్తింపు, అంగీకారం లభించింది.
పరస్పర అంగీకారంలో వివాహేతర సంబంధం గురించి నేటి సమాజం అంగీకార ధోరణితో ఉంది. అయితే, నాటి ప్రాచీన భారతంలో ఈ ధోరణి మరింత బాహాటంగా ఉండేది. నాడు వివాహేతర సంబంధం నేరంగా భావించేవారు కాదు. ఆ సంబంధాలకు కూడా సామాజిక గుర్తింపు లభించింది. సెక్స్‌లో ఆనందం పురుషుడికి మాత్రమే అవసరం, మహిళలకు అది అంత ముఖ్యం కాదనే భ్రమను మొదట పటాపంచలు చేసిన గ్రంథం వాత్సాయుడి కామసూత్ర. మహిళల భావప్రాప్తికి పురుషుడి తోడు ఉండాల్సిన అవసరం లేదు అని వాత్స్యాయనుడు మొట్టమొదట కామసూత్రలో చెప్పాడు.