Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ల వల్ల ఉపయోగం లేదు: డబ్య్లూహెచ్.వో

By:  Tupaki Desk   |   23 March 2020 6:50 AM GMT
లాక్ డౌన్ల వల్ల ఉపయోగం లేదు: డబ్య్లూహెచ్.వో
X
కరోనా వైరస్ రెండో స్టేజ్ పై అప్రమత్తంగా ఉన్న భారత్ జనతా కర్ఫ్యూలు, లాక్ డౌన్లతో జనసంచారాన్ని నియంత్రించే చర్యలు చేపట్టింది. వైరస్ నియంత్రణకు దేశవ్యాప్తంగా 80 జిల్లాల్లో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించారు.

లాక్ డౌన్ లో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వాలి. వైరస్ వ్యాప్తి చెందకుండా ఇదే మేలైన మార్గమని భావిస్తున్నారు.

అయితే తాజాగా లాక్ డౌన్లపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) బాంబు పేల్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజారోగ్యం పరంగా బలమైన చర్యలు చేపట్టకుండా కేవలం లాక్ డౌన్ లు ప్రకటించడం అత్యంత ప్రమాదమని స్పష్టం చేసింది. లాక్ డౌన్ లు ఎత్తివేసిన తర్వాత ఈ మహమ్మారి ఒక్కసారిగా మళ్లీ పుంజుకుంటుందని డబ్ల్యూహెచ్ ఓ ప్రతినిధి మైక్ ర్యాన్ తెలిపారు.

లాక్ డౌన్ ఎత్తివేసి ఎవరైతే వైరస్ బారిన పడ్డారో.. అనారోగ్యానికి గురయ్యారో గుర్తించి ఐసోలేషన్ చేయడం.. ఆచూకీ కనిపెట్టి వారికి త్వరగా చికిత్స చేస్తే తప్ప ఈ వ్యాధి నయం కాదని డబ్ల్యూహెచ్ ఓ ప్రతినిధి మైక్ ర్యాన్ స్పష్టం చేశారు.

ప్రతీ అనుమానితుడిని గుర్తించి చైనా, సింగపూర్, దక్షిణకొరియా ప్రభుత్వాలు వైద్యం అందిస్తూ నివారిస్తున్నాయని.. యూరప్, భారత్ వీటిని ఫాలో అవ్వాలని డబ్ల్యూహెచ్ తెలిపింది. వైరస్ నియంత్రణ అంత ఈజీ కాదని.. పోరాటాన్ని కొనసాగించాలన్నారు.

దీంతో తెలుగు రాష్ట్రాలు సహా కేంద్రం చేపట్టిన లాక్ డౌన్ల వల్ల ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రోగులను గుర్తించి చికిత్స చేయడమే కరోనా కట్టడికి మార్గం అని తెలుస్తోంది.