Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ ఎత్తివేస్తే ఇక ఆపడం ఎవరితరం కాదు : డబ్ల్యూహెచ్‌ ఓ!

By:  Tupaki Desk   |   2 May 2020 11:10 AM GMT
లాక్‌ డౌన్‌ ఎత్తివేస్తే ఇక ఆపడం ఎవరితరం కాదు : డబ్ల్యూహెచ్‌ ఓ!
X
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి క్రమక్రమంగా విజృంబిస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం - రాష్ట్రాల అభ్యర్తనలను పరిగణలోకి తీసుకోని ..దేశంలోని అన్ని జిల్లాలను మూడు రకాల జోన్లుగా విభజించి ..లాక్ డౌన్ నుండి కొన్ని సడలింపులు ఇవ్వబోతుంది. అలాగే మిగిలిన చోట్ల మరో రెండువారాల పాటు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నట్టు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే , కరోనా వైరస్‌ కొంతమేర తగ్గుముఖం పట్టిన దేశాల్లో లాక్‌ డౌన్‌ సడలింపులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు హెచ్చరికలు చేసింది.

మహమ్మారి బెడద‌ పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు లాక్ ‌డౌన్‌ నిబంధనలను సడలించవద్దని పలు దేశాలకు సూచించింది. ప్రస్తుత పరిస్థితుల్లో భౌతిక దూరం, లాక్ ‌డౌన్‌ మాత్రమే వైరస్‌ వ్యాప్తిని కంట్రోల్‌ చేయగలవుని స్పష్టం చేసింది. అమెరికా - భారత్‌ లాంటి దేశాలు ఆంక్షలను సడలిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొక తప్పదని డబ్ల్యూహెచ్ ‌ఓ తెలిపింది. ఈమేరకు ఆ సంస్థ ఎమర్జెన్సీస్ విభాగ సీనియర్‌ అధికారి డాక్టర్ మైక్ ర్యాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.

వైరస్‌ కట్టడికి ప్రస్తుతం వివిధ దేశాలు అవలంభిస్తున్న పలు చర్యలు బాగున్నాయని, ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం లేని ప్రాంతాల్లో ఆంక్షలను ఎత్తివేడం వల్ల తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉందని అభిప్రాయ పడ్డారు. సడలింపులు ఇస్తున్న చోట చాలా దేశాల్లో కేసులు ఒక్కసారిగా పెరుగాయని గుర్తు చేశారు. దీనితో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ముందుకుపోవాలని తెలిపారు. ఆఫ్రికా - మధ్య ఆసియా దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందన్నారు. కాగా భారత్‌లో వైరస్‌ ప్రభావం బట్టి మూడు జోన్లుగా విభజించిన విషయం తెలిసింది. రెడ్‌ జోన్‌ మినహా.. ఆరెంజ్‌ - గ్రీన్‌ జోన్లలో ఆంక్షలతో కూడా సడలింపులను ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనితో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భారత్ కి పెను ప్రమాదం తప్పదు అని అయన హెచ్చరించారు.