Begin typing your search above and press return to search.
భారత్ కు చెందిన ఆ సిరప్ లు వాడొద్దన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
By: Tupaki Desk | 6 Oct 2022 4:29 AM GMTగాంబియాలో 66 మంది మరణాలకు కారణం.. భారతదేశానికి చెందిన ఒక ఫార్మా కంపెనీ తయారు చేసిన సిరప్ లే కారణమన్న విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. సదరు ఫార్మా కంపెనీ సిరప్ లను వాడొద్దంటూ వార్నింగ్ ఇచ్చింది. 66 మంది మరణాలకు.. సదరు కంపెనీ సిరప్ లకు లింకు ఉంటుందన్న వ్యాఖ్యలు చేసిన డబ్ల్యూహెచ్ వో ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది.
తాజాగా డబ్ల్యూహెచ్ వో చీఫ్ టెడ్రోస్ విడుదల చేసిన ప్రకటనలో.. భారతదేశానికి చెందిన మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తి చేసిన దగ్గు.. జలుబు సిరప్ లను వాడటం వల్ల చిన్నారుల కిడ్నీలు దెబ్బ తిని మరణించి ఉంటారని తాము భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తాజా ఉదంతంతో భారత్ కు చెందిన మెయిడెన్ కంపెనీతో పాటు ఆ దేశ ఔషధ నియంత్రణ మండలిపైనా విచారణ ఉంటుందన్నారు.
ఈ కలుషిత మెడిసిన్స్ వెస్ట్ ఆఫ్రికా దేశం వెలుపల పంపిణీ చేసి ఉండొచ్చన్నారు. వాటిని ఎట్టి పరిస్థితుల్లో వాడొద్దన్న ఆయన.. మెయిడెన్ కంపెనీ తయారు చేసిన సిరప్ ల వివరాల్ని వెల్లడించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరప్ బ్రాండ్ పేర్లను చూస్తే.
- promethazine
- Kofexmalin (ఇది బేబీ కాఫ్ సిరప్)
- Makoff (బేబీ కాఫ్ సిరప్)
- Magrip N (జలుబు సిరప్)
ఈ సిరప్ లతో పిల్లల్లో వాంతులు.. డయేరియా.. తలనొప్పితో బాధ పడటంతో పాటు వారి కిడ్నీలు దెబ్బ తిని ప్రాణం పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ల్యాబ్ పరీక్షల రిపోర్టుల ప్రకారం ఆమోదయోగ్యం కాని రీతిలో డైథెలిన్ గ్లైకాల్.. ఇథిలీన్ గ్లైకాల్ తో సిరప్ లు కలుషితం అయినట్లుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కలుషితమైన మందుల్ని తయారీదారు గాంబియాకుమాత్రమే సరఫరా చేసినట్లుగా డబ్ల్యూహెచ్ వో చెప్పినప్పటికీ.. అనధికార మార్గాల్లో ఆఫ్రికాలోని ఇతర దేశాలకు ఆ సిరప్ లు పంపిణీ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. దేశ ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది. మెయిడెన్ కంపెనీ భారత్ లో కూడా అవే కలుషితమైన ఉత్పత్తుల్ని విడుదల చేసి ఉండొచ్చని.. అందుకే ఉత్పత్తుల జాబితా నుంచి వాటిని తొలగించటమే మంచిదన్న మాటను భారత ఔషధ నియంత్రణ మండలికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన చేయటం గమనార్హం. మరి.. ఈ వాదనలపై సదరు ఫార్మా కంపెనీ రియాక్షన్ ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.