Begin typing your search above and press return to search.
దేశాధినేతలంతా ‘మోడీ’ని ఫాలో అయిపోయారే..
By: Tupaki Desk | 16 Oct 2016 5:38 AM GMTప్రపంచ పెద్దన్నకు షాకిచ్చే ఒక రష్యా అధ్యక్షుడు.. ప్రపంచాన్ని తమ మాటలతో ప్రభావితం చేయగల చైనా అధినేత.. దక్షిణాఫ్రికా.. బ్రెజిల్ అధినేతలు ఇలాంటి వారంతా ఎవరికి వారుగా చూసినప్పుడు.. ఎవరినీ తక్కువ చేయలేం. ఎవరికి వారు శక్తివంతులే. ఈ నలుగురిలో ఎవరైనా సరే.. తమ దేశీయుల్నే కాదు.. ప్రపంచాన్నే ప్రభావితం చేయగల సత్తా ఉన్నోళ్లు.
తమ తీరుతో కోట్లాది మంది మదిని దోచుకునే వీరిని ప్రధాని మోడీ ప్రభావితం చేశారా? విధానాల పరంగా వారి నిర్ణయాల మీద ప్రభావం చూపించినా.. చూపించకున్నా.. డ్రెస్సింగ్ లో వారు తనను ఫాలో అయ్యేలా చేశారా? అంటే అవునన్న మాట వినిపిస్తుంది. ఆసక్తికరంగా అనిపించే ఈ అంశం బ్రిక్స్ దేశాధినేతలు కలిసి ఇచ్చిన ఫోటో ఫోజ్ చూస్తే.. స్పష్టమవుతుందని చెప్పక తప్పదు.
గోవాలో జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు తరలి వచ్చిన నలుగురు దేశాధినేతలతో కలిసి.. భారత ప్రధాని మోడీ గ్రూప్ గా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ సందర్భంగా వారు ధరించిన కోట్లు అన్ని మోడీ కోట్లుగా ఉండటం గమనార్హం. విధానాల పరంగా.. విషయాల పరంగా వేర్వేరు అభిప్రాయాలు ఉన్న ఈ నేతల్ని.. తన మార్క్ డ్రెస్సుల్నివేసుకునేలా చేయటంలో మోడీ ప్రభావితం చేయగలిగారా? అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగామారింది.
బ్రిక్స్ దేశాధినేతలంతా మోడీ కోట్లు వేసుకొని ఫోటోలకు ఫోజులివ్వటం.. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారాయి. మరోవైపు.. ఈ ఫోటోను ప్రధాని మోడీ ట్వీట్ చేస్తూ.. ‘బ్రిక్స్’ ఫ్యామిలీగా అభివర్ణించారు. నిజమే.. ఫ్యామిలీలో అందరూ ఒకే మైండ్ సెట్ లో ఉండాలన్న రూలేం లేదు. మైండ్ సెట్ ఒకటిగా లేకున్నా.. వేసుకున్న దుస్తులు ఒకేలా ఉండటం కొంతలో కొంత నయమని చెప్పక తప్పదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/