Begin typing your search above and press return to search.
2064 తరువాత ప్రపంచ జనాభా ఎంతో తెలుసా ..షాకింగ్ సర్వే?
By: Tupaki Desk | 27 Aug 2021 11:30 PM GMTదేశమంటే మట్టికాదోయ్..దేశమంటే మనుషులోయ్ అని ఓ మహాకవి అన్నారు. కానీ మనుషులు అన్ని దేశాల్లో ఒకేలా లేరు. ఒక చోట మోతాదుకు మించి జనాభా ఉంటే, మరో చోట వనరులున్నా జనాభా తగ్గిపోతుంది. 1989లో ఐక్య రాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించింది. అంతకు ముందు 1987 జులై 11న ప్రపంచ జనాభా 500 కోట్లు దాటింది. జనాభా విస్ఫోటనం జరుగుతుందని గుర్తించిన ఐక్యరాజ్య సమితి జనాభా పెరుగుదలపై ఫోకస్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 700 కోట్లు పై మాటే.
ఆ 700 కోట్ల జనాభా లో ఎక్కువ జనాభా ఆసియా దేశాల్లోనే ఉన్నారు. దీనితో ప్రస్తుతం ఉన్న జనాభాకు కావాల్సిన మౌళిక వసతులు, ఆహారం, ఉద్యోగాల కల్పన సరిగా అందక అనేక సమస్యలకి గురౌతున్నారు. అయితే, ప్రస్తుతం ప్రజల జీవన విధానంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. పిల్లల్ని కనడంపై కంటే, కెరీర్‌పైనే ప్రజలు ఎక్కువగా దృష్టిసారించారు. దీనితో అనేక దేశాల్లో జననాల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది. కరోనా మహమ్మారి ప్రభావం కూడా జననాల సంఖ్యపై పడింది.
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైన చైనాలో ఇద్దరు కాదు ముగ్గుర్ని కనమని చెబుతున్నారు. జనాభా పెరుగుదలను అరికట్టడానికి చైనా 1979లో వివాదాస్పద ‘వన్ చైల్డ్’ విధానాన్ని తీసుకువచ్చింది. ఆర్థిక వృద్ధి ప్రణాళికలపై ప్రభావం పడొచ్చన్న వాదనలున్నా వాటిని లెక్క చేయకుండా ఆ విధానాన్ని అమలు చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం చైనానే. వచ్చే నాలుగేళ్లలో 140 కోట్ల గరిష్ఠ స్థాయికి చైనా జనాభా వెళ్లి, 2100 నాటికి 73.2 కోట్లకు తగ్గుతుందని ఓ సర్వే వెల్లడించింది.
2020లో జపాన్ జనాభా 12.70 కోట్లు ఉండగా 2050 నాటికి ఈ సంఖ్య 10.60 కోట్లకు చేరుకోనుంది. అంటే జనాభాలో 16 శాతం తగ్గుదల నమోదు అవుతోంది. ఇక ఇటలీ విషయానికి వస్తే ఇదే కాలానికి 6.10 కోట్ల జనాభా కాస్త 5.40 కోట్లకు చేరుకోనుంది. గ్రీస్, క్యూబా దేశాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనవచ్చని అంచనా. ఇండియాలో కూడా జనాభా వృద్ధి రేటు తగ్గనుంది. తాజా గణాంకాలు ఇదే విషయాన్ని పట్టి చూపుతున్నాయి. 1991-2001 పదేళ్ల కాలానికి 2001-2011తో పోత్చితే జనాభా వృద్ధి రేటు 3.9 శాతం తగ్గింది. జనాభా పెరుగుదల విషయంలో భారతీయులు జాగ్రత్త వహిస్తున్నారని చెప్పాలి.
2018-19లో చేపట్టిన ఆర్థిక సర్వేలో 2030 నాటికి ఇండియాలో జననాల రేటు 2 కంటే దిగువకు చేరుకుంటుందని తేలింది. ఈ లెక్క ప్రకారం 2047 వరకు భారత దేశ జనాభా పెరుగుతూ పోయి గరిష్టంగా 161 కోట్లకు చేరుకుంటుందని.. ఆ తర్వాత తగ్గుదల నమోదు అవుతుందని అంచనా. మొత్తంగా 2100 నాటికి ఇండియా జనాభా 100 కోట్లకు పరిమితం అవుతుందని అంచనా. తాజాగా మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు జనాభా పెరుగుదలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. 2064 వరకు ప్రపంచంలోని జనాభా గరిష్టానికి చేరుకుంటుందని, ఆ తరువాత క్రమంగా తగ్గుతూ ఈ శతాబ్దం చివరినాటికి జనాభా సంఖ్య 50 శాతం తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న ఒత్తిడి పునరుత్పత్తి సామర్థ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుందని అన్నారు. జనాభా పెరిగిపోయిందని దేశంలో ఆందోళన నెలకొన్నా ఇప్పుడు ప్రపంచలోనే యువ జనాభా అధికంగా ఉన్న దేశంగా భారత్ నిలబడింది.