Begin typing your search above and press return to search.

వన్డే క్రికెట్‌ లో వరల్డ్ రికార్డు .. భారత సంతతి క్రికెటర్ అద్ఫుత సెంచరీ !

By:  Tupaki Desk   |   17 July 2021 12:30 PM GMT
వన్డే క్రికెట్‌ లో వరల్డ్ రికార్డు .. భారత సంతతి క్రికెటర్ అద్ఫుత సెంచరీ !
X
ఇంటర్నేషనల్ క్రికెట్‌ లో 50 ఓవర్ల ఫార్మెట్‌ లో ప్రపంచ రికార్డు నమోదు అయింది. ఐర్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌ లో భాగంగా శుక్రవారం మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో సరికొత్త వరల్డ్ రికార్డ్ నమోదైంది. ఐర్లాండ్ జట్టులోని భారత సంతతి క్రికెటర్ సిమి సింగ్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఎనమిదో స్థానంలో బ్యాటింగ్‌ కు దిగి సెంచరీ కొట్టిన తొలి బ్యాట్స్‌ మెన్‌ గా సిమి రికార్డ్ సృష్టించాడు.

34 ఏళ్ల ఈ ఆల్‌ రౌండర్ 91 బంతుల్లో 14 బౌండరీల సహాయంతో 100 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌ లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 346 పరుగుల భారీ స్కోర్ చేసింది. మలాన్ (177), డికాక్(120) సెంచరీలతో కదం తొక్కారు. అనంతరం 347 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ జట్టు మొదట్లోనే తడబడింది. 92 పరుగులకే కీలకమైన మొదటి 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సిమి సౌతాఫ్రికా బౌలర్లకు ధీటుగా ఎదుర్కొన్నాడు. కర్టిస్ కాంఫర్ తో జతకట్టిన సిమి జట్టు స్కోర్‌ ను 200 పరుగులు దాటించాడు.

తనదైన శైలిలో బ్యాటింగ్ చేసిన సిమి 91 బంతుల్లో శతకం నమోదు చేశాడు. కానీ, కాంఫర్ ఔటైన తర్వాత బ్యాట్స్‌మెన్లు లేకపోవడంతో సిమి ఒంటరి పోరు వృధా అయింది. ఐర్లాండ్ 276 పరుగులకే పరిమితమైంది. కాగా, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన ఆటగాడిగా మాత్రం సిమి సరికొత్త రికార్డు నమోదు చేశాడు. దీంతో ఈ పంజాబీ బ్యాట్స్‌మెన్‌ ఇన్నింగ్స్‌ పై పలువురు ప్రముఖ క్రికెటర్లు పొగడ్తలు కురిపిస్తున్నారు.