Begin typing your search above and press return to search.

రిటైర్మెంట్ దిశగా వరల్డ్ రిచెస్ట్ పర్సన్.. రంగంలోకి వారసురాలు..!

By:  Tupaki Desk   |   12 Jan 2023 11:30 PM GMT
రిటైర్మెంట్ దిశగా వరల్డ్ రిచెస్ట్ పర్సన్.. రంగంలోకి వారసురాలు..!
X
ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా ఎలన్ మస్క్ కొన్నాళ్ళపాటు కొనసాగారు. అయితే ట్విట్టర్ కొనుగోలు.. టెస్లా షేర్లు రికార్డు స్థాయిలో పడిపోవడంతో ఆయన తన నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయాడు. ఈ క్రమంలోనే ఫ్రాన్స్ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ ఆర్నాల్డ్ ప్రపంచ నెంబర్ వన్ కుబేరుడిగా మారిపోయాడు.

అయితే 73 ఏళ్ళ ఆర్నాల్డ్ అనారోగ్య కారణాలతో రిటైర్మెంట్ దిశగా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన వ్యాపార సామ్రాజ్యానికి వారసులను ఒక్కొక్కరిగా ప్రకటించుకుంటూ వెళ్తున్నారు. ఆయన పెద్ద కూతురు డైల్ ఫైన్ కు ఎంవీఎంహెచ్ తరుపున అతిపెద్ద బ్రాండ్ డియోర్ బాధ్యతలు అప్పగించనున్నట్లు నెల కిందట ప్రకటించారు.

అలాగే పెద్ద కుమారుడు ఆంటోనీ ఆర్నాల్డ్ కు వ్యాపారంలో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు ప్రకటించారు. బెర్నార్డ్ కు మొత్తం ఐదుగురు సంతానం కాగా వీరందరికీ తన వ్యాపారాన్ని ఒక్కొక్కటిగా అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని ఆయన భావిస్తున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

యూరప్ లోని లగ్జరీ బ్రాండ్ గా గుర్తింపు పొందిన ఎల్వీఎంహెచ్ కు సహా వ్యవస్థాపకుడిగా.. చైర్మన్ గా.. సీఈవోగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ నిర్వహిస్తున్నారు. ఫోర్బ్స్ నివేదికల ప్రకారంగా దీని విలువ 196 బిలియన్ డాలర్లు. అంచెలంచెలుగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ పోయిన బెర్నార్డ్  ఆ బాధ్యత నుంచి విరామం తీసుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

గత పదేళ్లుగా తండ్రి వెంటే ఉంటూ వ్యాపారాలను దగ్గరి నుంచి గమనిస్తున్న డెల్ ఫైన్ కే తన తదుపరి బాధ్యతలు అప్పగిస్తారని చర్చ నడుస్తోంది. డెల్ ఫైన్ తండ్రికి తగ్గ వారసురాలిగా ఇప్పటికే నిరూపించుకున్నారు. గత పదేళ్లలో ఆమె తీసుకున్న ఏ ఒక్క నిర్ణయం కూడా బెడిసి కొట్టలేదని సమాచారం.

దీంతో ఎల్వీఎంహెచ్ కంపెనీ సీఈవో బాధ్యతల నుంచి ఆర్నాల్డ్ తప్పుకుంటే ఆ బాధ్యతలను డెల్ ఫైన్ నిర్వహించగలరని ఆ కంపెనీ డైరెక్టర్లు బలంగా నమ్ముతున్నారు. ఇది ఆమెకు కలిసొచ్చే అంశంగా కన్పిస్తోంది. మరోవైపు  ఆర్నాల్డ్ తన బాధ్యతల నుంచి త్వరలో తప్పుకోనుండటంతో కుటుంబంలోని వారికి ఏయే పదవులు దక్కుతాయనేది ఆసక్తికరంగా మారింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.