Begin typing your search above and press return to search.

WTCF : ఐసీసీ గద కోసం మా పాస్ పోర్టులు లాక్కున్నారు

By:  Tupaki Desk   |   27 Jun 2021 12:30 PM GMT
WTCF : ఐసీసీ గద కోసం మా పాస్ పోర్టులు లాక్కున్నారు
X
ఐసీసీ మొదటి టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్‌ లో ఇండియా పై గెలుపొందిన న్యూజీలాండ్ కు స్వదేశంలో అద్బుత స్వాగతం లభించింది. ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్‌.. వన్డే ప్రపంచ కప్ కోసం పట్టుదలతో ఆడుతూ వచ్చిన న్యూజీలాండ్ ఒక్కసారి కూడా ఆ ట్రోఫీలను దక్కించుకోలేక పోయాయి. ఇప్పటి వరకు ఐసీసీ నిర్వహించిన ఏ ప్రతిష్టాత్మక ట్రోఫీని కూడా కివీస్ ఆటగాళ్లు ముద్దాడలేక పోయారు. దాంతో ఆ దేశ క్రికెట్ అభిమానులకు నిరుత్సాహమే మిగిలింది. కాని ఈసారి మాత్రం వారు ఆనందంతో వీధుల్లో డాన్స్ లు వేశారట.

ఐసీసీ ట్రోఫీ కోసం సుదీర్ఘ కాలంగా నిరీక్షిస్తున్న తమకు ఈ ట్రోఫీ దక్కడం చాలా సంతోషంగా ఉందని కివీస్ ఆటగాళ్లు తమ ఆనందంను వ్యక్తం చేస్తున్నారు. న్యూజిలాండ్‌ లో అడుగు పెట్టినప్పటి నుండి కూడా కివీస్ ఆటగాళ్లతో కలిసి ఫొటోలు దిగేందుకు.. వారితో కరచాలనం చేసేందుకు అభిమానులు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా కారణంగా అభిమానులతో ఈ సమయంను ఎంజాయ్‌ చేయలేక పోతున్నాం అని.. కాని వారి ఆనందం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందంటూ ఒక కివీస్ ఆటగాడు పేర్కొన్నాడు.

ఇక ప్రతి ఒక్కరు కూడా ఐసీసీ వారు ఇచ్చిన గద ఎక్కడ ఉందని ప్రశ్నిస్తున్నారు అంటూ మరో క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు. ఎయిర్‌ పోర్టు లో మా పాస్‌ పోర్టులు తీసుకుని గద చూపించాలని... దానితో తాము ఫొటోలు దిగి ఇస్తామంటూ పోలీసు అధికారులు విమానాశ్రయం అధికారులు కోరారు. ఐసీసీ వారు ఈసారి ప్రత్యేకంగా ట్రోఫీని గద రూపంలో తయారు చేయించిన విషయం తెల్సిందే. ఆ గద కోసం ఇండియా కివీస్ హోరా హోరీగా పోరాటం చేశాయి. చివరకు వరణుడి కారణంగా కివీస్ కు అదృష్టం కలిసి వచ్చింది.

విజయం దోబూచులాడి చివరకు కివీస్ కు దక్కింది. అయితే ఈ విజయంకు వారు పూర్తి అర్హులు అనేది ప్రపంచ క్రీడాభిమానుల మాట. ప్రతి ఒక్కరు కూడా ఈ సందర్బంను ఎంజాయ్‌ చేస్తున్నట్లుగా న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు చెప్పుకొచ్చింది. ఐసీసీ టోర్నీని మొదటి సారి గెలిచినందుకు గతంలో ఎప్పుడు దక్కనంత అపూర్వ స్వాగతం ఈ సారి దక్కిందని కివీస్ ఆటగాళ్లు ఉబ్బి తబ్బిబ్బు అవుతున్నారు.