Begin typing your search above and press return to search.

ఆఫ్టర్ కరోనా.. మోడీ ప్లాన్స్ అదుర్స్.!

By:  Tupaki Desk   |   5 May 2020 3:00 PM GMT
ఆఫ్టర్ కరోనా.. మోడీ ప్లాన్స్ అదుర్స్.!
X
కరోనా మహమ్మారి అరికట్టిన తర్వాత.. లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు సామాన్యుల్లోనే కాదు.. దేశానికి నాయకత్వం వహిస్తున్న మన ప్రధాని నరేంద్రమోడీ మనసులో కూడా చాలా ప్రశ్నలున్నాయి. కుప్పకూలిన ఆర్థికవ్యవస్థను ఎలా గాడినపెట్టడం.. ప్రపంచవ్యాప్తంగా మారిన అంతర్జాతీయ వ్యవస్థలను ఎలా మళ్లీ కొత్తగా సృష్టించాలనే దానిపై తన మనోగతాన్ని మోడీ బయటపెట్టారు.

కరోనా ముగిసిన అనంతరం ప్రపంచంలో అంతర్జాతీయ వ్యవస్థ రూపొందించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ సంస్థల పరిమితులను కరోనా సంక్షోభం ఎత్తి చూపిందని ఆయన అన్నారు.

తాజాగా అలీనోద్యమ (నామ్) దేశాల నేతలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మోడీ ఆఫ్టర్ కరోనా తర్వాత తన ప్లాన్లు.. నవశకం తెచ్చేందుకు ఏం చేయాలనే దానిపై సవివరంగా చర్చించారు. ఇందుకోసం నూతన అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడాల్సి ఉందని మోడీ చెప్పారు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను ప్రతిబింబించే అంతర్జాతీయ వ్యవస్థలు నేడు అవసరమన్నారు.

ఈ కొత్త వ్యవస్థలు కేవలం ఆర్థిక అభివృద్ధినే కాకుండా.. మానవాళి సంక్షేమాన్ని కాంక్షించే వ్యవస్థలుగా ఉండాలని మోడీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి విషయాల్లో భారత్ ఎప్పుడూ ముందుంటుందని హామీ ఇచ్చారు. ఆ దిశగా అందరం కృషి చేద్దామని మోడీ నామ్ దేశాలకు పిలుపునిచ్చారు.