Begin typing your search above and press return to search.

హైదరాబాద్ మహానగర శివారు లో అతి పెద్ద ధ్యాన మందిరం

By:  Tupaki Desk   |   25 Jan 2020 4:37 AM GMT
హైదరాబాద్ మహానగర శివారు లో అతి పెద్ద ధ్యాన మందిరం
X
ఒకేసారి లక్ష మంది.. ఒకే చోట కూర్చొని ధ్యానం చేసుకునే అవకాశం. విన్నంతనే విచిత్రమైన ఊహను సొంతం చేసేలా ఉన్న ఆ ఆలోచనను వాస్తవరూపంలోకి తీసుకొచ్చిందో సంస్థ. ఇంతకాలం హైదరాబాద్ మహానగర సిగ లో ఎన్నో ప్రత్యేకతల మాటున.. తాజాగా ధ్యాన నగరం ఇమేజ్ ను సొంతం చేసుకునే భారీ నిర్మాణం ఒకటి పూర్తి అయ్యింది. ప్రఖ్యాత ధ్యాన శిక్షణ సంస్థ హార్ట్ ఫుల్ నెస్ ప్రధాన కేంద్రం నగర శివారులో ఉన్న చేగూరులోని కన్హా శాంతివనంలో ఏర్పాటు చేశారు.

ఈ భారీ నిర్మాణంతో హైదరాబాద్ ఇకపై ధ్యాన రాజధాని గా మారుతుందని చెప్పక తప్పదు. హార్ట్ ఫుల్ నెస్ సంస్థ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 28న భారీ ద్యానకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఒకేసారి లక్ష మంది కలిసి ధ్యానం చేసుకునేలా 30 ఎకరాల్లో ఈ భారీ సముదాయాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా ముఖ్య అతిధి గా పాల్గొని ప్రసంగించనున్నారు.

ఈ నిర్మాణం ప్రత్యేకత ఏమంటే.. రాత్రివేళలో ఈ మహాధ్యాన కేంద్రం ఆస్ట్రేలియా లోని సిడ్నీ హార్బర్ షేప్ లో ఉండటం అందరిని ఆకర్షిస్తోంది. ప్రధాన మందిరం.. దానిని అననుకొని చుట్టూ ఉండే ఎనిమిది ధ్యాన కేంద్రాలతో కొత్త కళను తీసుకొచ్చిందని చెప్పాలి. మహా ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భం గా ఏర్పాటు చేసే కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు.. సామాజిక వేత్త అన్నా హాజారే కూడా రానున్నారు.