Begin typing your search above and press return to search.

న‌ష్టాల్లోనూ అప‌ర కుబేరుడిగా బెజోస్!

By:  Tupaki Desk   |   30 Oct 2018 2:30 PM GMT
న‌ష్టాల్లోనూ అప‌ర కుబేరుడిగా బెజోస్!
X
ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్....ఆన్ లైన్ గ్లోబ‌ల్ మార్కెట్ ను శాసిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 2018కుగాను ప్ర‌పంచ అప‌ర కుబేరుడిగా అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వెలుగొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా వెలుగొందులోన్న బెజోస్...తాజాగా మ‌రో రికార్డు సృష్టించారు. సంపాదించ‌డ‌మే కాదు..ఆ సంపదను కోల్పోవడంలోకూడా బెజోస్ స‌రికొత్త‌ రికార్డు సృష్టించారు. గత రెండు రోజుల్లో బెజోస్ దాదాపుగా....19.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1,40,962 కోట్లు)న‌ష్ట‌పోయారు. అంత‌ర్జాతీయ మార్కెట్లో ఏర్ప‌డ్డ అనిశ్చితి కారణంగా బెజోస్ న‌ష్టాలు చ‌విచూడాల్సి వ‌చ్చింది. యూఎస్ స్టాక్ మార్కెట్లో అమెజాన్ ఈక్విటీ వాటాలు భారీ నష్టాలను చవిచూడ‌డంతో బెజోస్ ల‌క్షా న‌ల‌భైవేల కోట్లు న‌ష్ట‌పోయారు. ఈ క్ర‌మంలో బెజోస్.... ఫేస్ బుక్ కో ఫౌండ‌ర్ మార్క్ జుకర్ బర్గ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించారు.

అమెజాన్ కంపెనీ ఈక్విటీ వాటాల విలువ దారుణంగా పడిపోవడంతో - జెఫ్ బెజోస్ 1,40,962 కోట్ల రూపాయ‌లు న‌ష్ట‌పోయారు. అమెజాన్ ఈక్విటీల విలువ ఈ నెలలో భారీగా పతనం కావ‌డం ఇందుకు కార‌ణం. ఈ నేప‌థ్యంలో ఈ నెల ప్రారంభంలో 167.7 బిలియన్ డాలర్లుగా ఉన్న బెజోస్ సంపద అమాంతం 128.1 బిలియన్ డాలర్లకు ప‌డిపోయింది. 19.2 బిలియ‌న్ డాల‌ర్ల రికార్డు న‌ష్టాన్ని బెజోస్ చ‌విచూశారు. ఈ క్ర‌మంలోనే బెజోస్ జుక‌ర్ బ‌ర్గ్ రికార్డును బ‌ద్దలు కొట్టారు. ఈ ఏడాది జూలైలో జుక‌ర్ బ‌ర్గ్ రెండు రోజుల వ్యవధిలో 16.5 బిలియన్ డాలర్లు నష్టపోయారు. డేటా బ్రీచ్ ఉదంతం నేప‌థ్యంలో జుక‌ర్ బ‌ర్గ్ న‌ష్ట‌పోయారు. కాగా, మరో బిలియనీర్ బిల్ గేట్స్ - గత రెండు రోజుల్లో 558.3 మిలియన్ డాలర్ల సంపదను నష్టపోయారు. కాగా, కొద్ది రోజుల క్రితం ....అనూహ్యంగా జెఫ్ బెజోస్ దాదాపు 66వేల కోట్ల రూపాయ‌ల భారీ మొత్తాన్ని న‌ష్ట‌పోయారు. గ్లోబ‌ల్ మార్కెట్ సెల్ ఆఫ్ వ‌ల్ల ప్ర‌పంచ‌వ్యాప్తంగా 500మంది బిలియ‌నీర్లు పెద్ద మొత్తంలో న‌ష్ట‌పోయారు. వారిలో బెజోస్ ఒక్క‌రే దాదాపు 66 వేల కోట్లు న‌ష్ట‌పోవ‌డం విశేషం.