Begin typing your search above and press return to search.
హైదరాబాద్ ప్రముఖ హోటల్ బిర్యానీలో పురుగులు.. దేవుడా ఇదెక్కడి దరిద్రం?
By: Tupaki Desk | 19 Aug 2022 11:30 AM GMTబిర్యానీ అన్నంతనే హైదరాబాద్ గుర్తుకు వస్తుంది. నిజానికి భాగ్యనగరి అన్నంతనే చార్మినార్ గుర్తుకు వచ్చేది. కొద్దికాలంగా బిర్యానీ ఇప్పుడు హైదరాబాద్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. తెలంగాణతో సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బిర్యానీ అన్నంతనే.. హైదరాబాద్ మహానగరం పేరు ముందు ఉండే పరిస్థితి.
ఒకప్పుడు ముత్యాల నగరిగా పేరున్న హైదరాబాద్ కుఇప్పుడు బిర్యానీ పుణ్యమా అని సరికొత్త ఇమేజ్ వచ్చిందని చెప్పాలి. అలాంటిది ఒక ప్రముఖ హోటల్ సిద్ధం చేసిన బిర్యానీలో పురుగులు ఉన్న వైనం గుర్తించిన వినియోగదారులు కంగుతినే పరిస్థితి. ఇంతకూ అసలేం జరిగిందంటే..
హైదరాబాదీయులే కాదు.. హైదరాబాద్ కు వచ్చే వారిలో అత్యధికులు తినే తినుబండారంగా హైదరాబాద్ బిర్యానీగా చెప్పాలి. తాజాగా నారాయణగూడలోని ఒక ప్రముఖ హోటల్ కు వెళ్లిన కస్టమర్ ఒకరు బిర్యానీకి ఆర్డర్ ఇచ్చారు. వారు ఇచ్చిన బిర్యానీ తీసుకొని.. తినే వేళలో ఏదో తేడాగా ఉందన్న విసయాన్ని గమనించిన సదరు కస్టమర్.. జాగ్రత్తగా చూస్తే.. అందులో పురుగులు ఉండటంతో ఒక్కసారి షాక్ తిన్నాడు.
అంత పెద్ద హోటల్లో ఆర్డర్ ఇచ్చిన బిర్యానీ పురుగులతో ఉండటంతో ఆగ్రహానికి గురైన అతను.. హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. తప్పు తమ వైపు జరిగినట్లుగా వారు చెప్పారు. అయితే.. ఇంత నిర్లక్ష్యమా?అంటూ ప్రశ్నించగా.. వారు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే.. సదరు కస్టమర్ వాదన మరోలా ఉంది.
ఫుడ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సింది పోయి.. ఇంత దారుణంగా ఎలా వ్యవహరిస్తారు? అని ప్రశ్నిస్తూ జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేశాడు. సదరు కస్టమర్ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు సైతం ఎంట్రీ ఇచ్చారు. కేసు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.
మున్సిపల్ అధికారులు కూడా రంగంలోకి దిగినట్లు చెబుతున్నారు. కొన్ని హోటళ్ల కారణంగా హైదరాబాద్ బ్రాండ్ గా మారిన బిర్యానీకి ఇలాంటి ఉదంతాలు దెబ్బ తీస్తాయన్న మాట వినిపిస్తోంది.