Begin typing your search above and press return to search.

ఆమెకు ఏడుపు ఒక్క‌టే త‌క్కువ‌...

By:  Tupaki Desk   |   7 Aug 2015 7:16 AM GMT
ఆమెకు ఏడుపు ఒక్క‌టే త‌క్కువ‌...
X
ఐపిఎల్ మాజీ చీఫ్ లలిత్ మోడీ విదేశీ ప‌ర్య‌ట‌న‌కు స‌హ‌కరించిన విష‌యంలో కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్ తీవ్ర చిక్కులు ఎదుర్కుంటున్నారు. తాను మాన‌వ‌తా దృక్ప‌థంతోనే మోడీకి స‌హ‌క‌రించాన‌ని సుష్మా వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సి వ‌స్తోంది. తాజాగా మ‌రోమారు సుదీర్ఘ వివ‌ర‌ణ ఇచ్చిన సుష్మా ఒకింత ఆవేద‌న‌కు గుర‌య్యారు.

లలిత్ మోడీ అంశంలో తానేమి చేశానని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు.కాంగ్రెస్ తో చర్చకు సిద్ధంగా ఉన్నాన‌ని, చర్చిస్తేనే తాను సమాధానాలు చెబుతానని స్పష్టం చేశారు. ఆమె మాటల్లోనే...''రెండు నెలలుగా మీడియాలో నాపై ఆరోప‌ణ‌ల‌తో దుష్ర్పచారం జరగుతోంది. ఆరోపణల‌కు సంబంధించి చర్చలకు సిద్ధంగా ఉన్నా. మోడీకి సంబంధించి నిర్ణయాన్ని బ్రిటన్ ప్రభుత్వానికి వదిలేశా. మోడికి ఎలాంటి సిఫార్సులు చేయలేదు. చేసిన‌ట్లుంటే ఒక్క ఆధారమైనా ఉంటే బయటపెట్టాలి" అని స‌వాల్ విసిరారు.

'ల‌లిత్ మోడీ సతీమణి క్యాన్సర్ తో బాధ పడుతోంది. ఈమె చికిత్స తీసుకొంటోంది. ఈసారి ప్రమాదకరంగా వ్యాధి మారిందని, చికిత్స చేసే తరుణంలో మృతి చెందడం లేదా రెండు కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉందని బ్రిటన్ వైద్యులు పేర్కొన్నారు. దీనికి సంబంధించి మోడీ సతీమణి నాకు లేఖ రాశారు. చికిత్స సమయంలో భర్త రావాల్సి ఉంటుంద‌ని అందులో పేర్కొన్నారు. అందుకే నేను ప్రయాణ ఏర్పాట్ల కోసం చేశాను. నా స్థానంలో మీరు (స్పీకర్) ఉంటే ఏం చేస్తారు ? సోనియా గాంధీ ఉంటే ఏం చేస్తారు ? చనిపోయేందుకు అవకాశం ఇస్తారా ? మోడీకి ఇక్కడ సహాయం చేయలేదు. ఆమె భార్యకు సహాయం చేయడం జరిగింది. ఇలాంటి మహిళకు సహాయం చేయడం నేరమైతే అలాగే అనుకోండి' అంటూ సుష్మా స్వరాజ్ ఒకింత ఆవేద‌న‌గా మాట్లాడారు.

లలిత్ మోడీ వ్యవహారంలో మానవీయ కోణంలో స్పందించానని సుష్మా స్వరాజ్ చెప్తుండ‌గా...ఆమె అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌ని, రాజీనామా చేయాలని గత కొంతకాలంగా విపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.