Begin typing your search above and press return to search.
ఇదే నిర్ణయాన్ని రోజు ముందు చెబితే తలంటు తప్పేది కదా?
By: Tupaki Desk | 30 April 2021 11:30 AM GMTతిడితే కానీ కదలరా? అన్న మాట తెలుగువారి నోటి నుంచి బాగానే వినిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగతంగా మాటలు అనిపించుకుంటే.. అది ఆ వ్యక్తి.. మాటలు అనిపించుకునే వారికే పరిమితం అవుతుంది. కానీ.. రాష్ట్రం మొత్తానికి దిక్సూచిగా ఉండాల్సిన ప్రభుత్వం.. నిర్ణయాల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో రాత్రి వేళ కర్ఫ్యూ ఈ రోజుతో ముగియనుంది. శనివారం నుంచి సంగతేమిటి? అన్నది ప్రశ్న. ఇదే విషయాన్ని గురువారం ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించినప్పుడు.. తాము సమావేశమై నిర్నయాన్ని తీసుకుంటామని చెప్పారు.
ఈ సందర్బంగా కేసీఆర్ సర్కారుకు ఏపీ హైకోర్టు తలంటు పోసింది. కర్ఫ్యూ గడువు విషయంలోనూ ముందస్తుగా నిర్ణయాలు తీసుకోరా? అని ప్రశ్నించటంతో పాటు.. మీరు ఆకాశంలో ఉంటారా? నేల మీద ఉంటారా? అని ప్రశ్నించింది. చుట్టు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవటానికి బదులుగా.. గడువు తేదీని గుర్తు పెట్టుకొని.. ఆ రోజే నిర్ణయం తీసుకోవటం సరికాదన్నది హైకోర్టు మాటన్నది. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్అలీ ఒక సమావేశాన్ని హాజరు పర్చారు.
ఈ సందర్భంగా ఆయన కీలక నిర్ణయాల్ని తీసుకున్నారు. శుక్రవార ముగిసే కర్ఫ్యూను మరో వారం పొడిగించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. నిజానికి ఇదే అంశంపై నిన్న (గురువారం) హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తానికి హైకోర్టు లో చేసిన వ్యాఖ్యలకు ఏ మాత్రం తగ్గకుండా.. రాత్రి కర్ఫ్యూను విధిస్తూ నిర్నయం తీసుకున్నారు. ఇవాల్టి రోజున హడావుడిగా నిర్ణయం తీసుకునే బదులుగా.. ప్రభుత్వమే ముందస్తుగా కర్ఫ్యూ లాంటి అంశాల విషయంలో ముందస్తుగా నిర్ణయాలు తీసుకోవటం బాగానే ఉన్నా.. నిన్నటి హైకోర్టు తలంటు నుంచి తప్పించుకునే అవకాశం ఉండేది కదా? అయినా.. హైకోర్టు అసహనం వ్యక్తం చేస్తే తప్పించి.. నిర్ణయాత్మక అంశాలపై నిర్ణయాలు తీసుకోవటంలో ఇంత ఆలస్యం ఏంది? దీనికెవరు బాధ్యులు అవుతారు?